India Vs Australia : ధోనీని వెనక్కి నెట్టిన పంత్; ఆసీస్ గడ్డపై సరికొత్త రికార్డు

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్.. ఒకే ఒక్క ఇన్నింగ్ లో తన సత్తా ఏ పాటిదో ప్రపంచానికి తెలియజేశాడు

Last Updated : Jan 4, 2019, 03:26 PM IST
India Vs Australia : ధోనీని వెనక్కి నెట్టిన పంత్; ఆసీస్ గడ్డపై సరికొత్త రికార్డు

సిడ్నీ: ఆసీస్‌తో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్ లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ అదరగొట్టాడు. సెంచరీతో కదం తొక్కి సత్తా చాటాడు. తన బ్యాటింగ్ శైలితో టెస్టు మ్యాచ్ ను వన్డే తరహా మార్చేశాడు. ఈ మ్యాచ్ లో 159 పరుగులు చేసిన పంత్ టీమిండియాకు భారీ స్కోర్ నమోదు విషయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో పంత్ ఓ సరికొత్త రికార్డును సష్టించాడు. ఆసీస్ గడ్డపై టెస్టుల్లో ఏ భారత వికెట్ కీపర్ కు సాధ్యం కానీ సెంచరీ సాధించాడు. అలాగే ఆసిస్ గడ్డపై అత్యధిక స్కోర్ సాధించిన వికెట్ భారత వికెట్ కీపర్ గా మరో రికార్డు నమోదు చేశారు.

ఆసీస్ గడ్డపై వికెట్ కీపర్ల స్కోర్లు ఇవే..

రిషబ్ పంత్           - 159 నాటౌట్      ( సిడ్నీ టెస్టు, 2019 )
ఫారూక్ ఇంజనీర్    - 89  పరుగులు   (అడిలైడ్ టెస్టు,1967 )
కిరణ్ మోర్           -  67  పరుగులు   ( మెల్ బోర్న్  1991 )
పార్థీవ్ పటేల్         -  62  పరుగులు   ( సిడ్నీ టెస్టు,  2004 )
ఎంఎస్ ధోనీ          -  57 పరుగులు    ( సిడ్నీ టెస్టు, 2012 )

 

ఆసీస్ కెప్టెన్ కు పంత్ బ్యాట్ తో సమాధానం !

ఆసీస్ కెప్టెన్ పైన్ తో మాటలు యుద్ధం చేసిన రిషబ్ ఇప్పుడు బ్యాట్ తో కూడా సమాధానం చెప్పాడు. తాను తాత్కాలిక వికెట్ కీపర్ కాదని.. భవిష్యత్తు ఉన్న వికెట్ కీపర్ అని తన ఒకే ఒక్క ఇన్నింగ్ ద్వారా రిషబ్ పంత్ సమాధానం ఇచ్చాడు. రిషబ్ ఇన్నింగ్ పై ఇప్పుడు ఆసీస్ కెప్టెన్ ఇప్పుడు ఏలా స్పందిస్తాడనేది చర్చనీయంశంగా మారింది

Trending News