ఇండియా vs సౌతాఫ్రికా 5వ వన్డే అప్‌డేట్స్: రో'హిట్' శర్మ 17వ వన్డే సెంచరీ

రో'హిట్' శర్మ 17వ సెంచరీ

Updated: Feb 13, 2018, 11:55 PM IST
ఇండియా vs సౌతాఫ్రికా 5వ వన్డే అప్‌డేట్స్: రో'హిట్' శర్మ 17వ వన్డే సెంచరీ

సౌతాఫ్రికాతో జరుగుతున్న 6 వన్డేల సిరీస్ లో భాగంగా నేడు పోర్ట్ ఎలిజబెత్ లో జరుగుతున్న 5వ వన్డేలో ఓపెనర్ గా దిగిన రోహిత్ శర్మ 106 బంతుల్లో సెంచరీ (10x4, 4x6)  పూర్తి చేశాడు. పోర్ట్ ఎలిజబెత్ లో రోహిత్ కి ఇది మొదటి సెంచరీ కాగా తన వన్డె కెరీర్ లో 17వ సెంచరీ. షార్ట్ డెలివరీలు, మంచి షాట్స్ తో అలరించిన రోహిత్ కి ఈ సెంచరీ ప్రత్యేకమైనదనే చెప్పుకోవచ్చు. 

CLICK HERE FOR INDIA VS SOUTH AFRICA 5TH ODI LIVE UPDATES 

రోహిత్ సెంచరీ పూర్తి చేసే సమయానికి టీమిండియా 36 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 203 పరుగులు పూర్తి చేసింది. టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ 36 పరుగులు, శిఖర్ ధావన్ 34 పరుగులు, అజింక్య రహానే 8 పరుగులు చేసి ఔట్ అయ్యారు.