'డాక్టర్ స్ట్రేంజ్'లో స‌చిన్ న‌టిస్తే బాగుంటుంది: హాలీవుడ్ నటుడు బెనెడిక్ట్‌ కంబర్‌‌బ్యాచ్‌

ఇటీవల సచిన్‌ టెండూల్కర్ తన బయోపిక్ చిత్రం ‘సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’తో నటుడిగా మారారు.

Last Updated : Apr 24, 2018, 04:06 PM IST
'డాక్టర్ స్ట్రేంజ్'లో స‌చిన్ న‌టిస్తే బాగుంటుంది: హాలీవుడ్ నటుడు బెనెడిక్ట్‌ కంబర్‌‌బ్యాచ్‌

మాస్టర్ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్ అమెరికన్‌ సూపర్‌ హీరో సిరీస్ ‘డాక్టర్‌ స్ట్రేంజ్‌’ ‌లో నటిస్తే బాగుంటుందని హాలీవుడ్ న‌టుడు బెనెడిక్ట్‌ కంబర్‌‌బ్యాచ్‌ అభిప్రాయపడ్డారు. ఈ సిరీస్‌లో బెనెడిక్ట్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అయితే, బెనెడిక్ట్‌ న‌టించిన తాజా చిత్రం ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్’ సినిమా. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ నటుడు సింగపూర్‌‌కి వెళ్ళినప్పుడు అక్కడ మాజీ ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ బ్రెట్‌లీని కలిశారు.

ఈ సందర్భంగా ఇద్దరూ ‘డాక్టర్‌ స్ట్రేంజ్‌’ సినిమా గురించి మాట్లాడుకున్నారు. అప్పుడు ఈ పాత్రలో ఏ క్రికెటర్‌ నటిస్తే బాగుంటుంది అని బ్రెట్‌లీ ఈ హాలీవుడ్ న‌టుడ్ని ప్రశ్నించగా...ఆ వెంటనే బెనెడిక్ట్ సచిన్‌ నటిస్తే బాగుంటుంది స‌మాధానం ఇచ్చారు. కాగా ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్’ మూవీ భారత్‌లో ఏప్రిల్‌ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారత్‌లో దాదాపు 2000లకు పైగా స్క్రీన్లపై  ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. అదే నిజమైతే భారత్‌లో అత్యధిక స్క్రీన్లలో విడుదలైన తొలి హాలీవుడ్‌ చిత్రం ఇదే అవుతుందని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రం ఆంగ్లంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ విడుదల కాబోతోంది. 2డీ, 3డీ, ఐమ్యాక్స్‌ 3డీలో ఈ చిత్రం విడుదలవుతోంది. హాలీవుడ్‌ సూపర్‌ హీరోలందరూ ఈ చిత్రంలో నటించారు.

ఇటీవల సచిన్‌ టెండూల్కర్ తన బయోపిక్ చిత్రం ‘సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’తో నటుడిగా మారారు. అయితే అది తన బయోపిక్ సినిమా కాబట్టి నటించారు. అంతేకాని మరే సినిమాలోనూ ఆయన నటించడానికి అంగీకరించలేదు. ఈ చిత్రంలో సచిన్ నటన భారతీయులకే కాదు.. హాలీవుడ్ నటులకు తెగ నచ్చేసింది. ప్రముఖ హాలీవుడ్‌ నటుడు బెనెడిక్ట్‌కి కూడా తెగ నచ్చేసినట్టుంది కాబోలు..!

 

Trending News