ఇండియా vs సౌతాఫ్రికా 4వ నవ్డే: 100 వన్డేలో 100 కొట్టిన ధావన్

100వ వన్డేలో సెంచరీ చేసిన మొట్టమొదటి ఇండియన్ క్రికెటర్‌

Updated: Feb 10, 2018, 07:30 PM IST
ఇండియా vs సౌతాఫ్రికా 4వ నవ్డే: 100 వన్డేలో 100 కొట్టిన ధావన్

జొహన్నెస్ బర్గ్ వాండరర్స్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న 4వ వన్డేలో టీమిండియా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 2010లో వన్డే ఇంటర్నేషనల్ కెరీర్‌లోకి అడుగుపెట్టిన ధావన్‌కి నేడు ఆడుతున్న మ్యాచ్ 100వ వన్డే ఇంటర్నేషనల్ కావడం ఒక విశేషమైతే... 100 వన్డే ఇంటర్నేషనల్‌లోనూ 100 పరుగులు పూర్తి చేయడం మరో విశేషం. 

CLICK HERE FOR MORE CRICKET LIVE UPDATES:

100వ వన్డేలో సెంచరీ చేసిన మొట్టమొదటి ఇండియన్ క్రికెటర్‌గా శిఖర్ ధావన్ చరిత్ర సృష్టించాడు. ధావన్ వన్డే ఇంటర్నేషనల్స్ కెరీర్‌లో ఇది 13వ సెంచరీ. ఇదే వన్డే సిరీస్‌లో సౌతాఫ్రికాతో జరిగిన 3వ వన్డే మ్యాచ్‌లో 76 పరుగులు చేసి తన వన్డే ఇంటర్నేషనల్ కెరీర్‌లో 25వ హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు ధావన్. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close