ధోనీ రికార్డు బద్దలు కొట్టిన రైనా !

Updated: Mar 13, 2018, 04:28 PM IST
ధోనీ రికార్డు బద్దలు కొట్టిన రైనా !

అంతర్జాతీయ క్రికెట్ లో అపార అనుభవమున్న ధోనీ రికార్డును రైనా బద్దలు కొట్టేశాడు. వినడానికి ఒకింత ఆశ్చర్యానికి గురిచేసినా.. ఇది నిజమే మరి. వివరాల్లోకి వెళ్లినట్లయితే ఇంటర్నేషనల్ టి 20 క్రికెట్ లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో ధోనీని వెనక్కి నెట్టి రైనా మూడో స్థానంలో నిలిచాడు.

సోమవారం భారత్‌-శ్రీలంక మధ్య టీ20 మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రైనా 27 పరుగులు చేశాడు. దీంతో అతడి పరుగుల సంఖ్య 1,452 కి చేరింది. మాజీ కెప్టెన్ ధోనీ 1,444 పరుగులతో ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్‌ కోహ్లీ1,983 పరగులతో అగ్రస్థానంలో ఉండగా .. ఓపెనర్ రోహిత్‌ శర్మ 1,696 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.