తమ్ముడు పార్థివ్ పై.. అన్న సెహ్వాగ్ సెటైర్

ఈ మధ్యకాలంలో ట్విట్టర్ వేదికగా తన తోటి క్రీడాకారులను ఆటపట్టించడం వీరేంద్ర సెహ్వాగ్‌కి ఒక దినచర్యగా మారింది.

Updated: Jan 10, 2018, 04:01 PM IST
తమ్ముడు పార్థివ్ పై.. అన్న సెహ్వాగ్ సెటైర్

ఈ మధ్యకాలంలో ట్విట్టర్ వేదికగా తన తోటి క్రీడాకారులను ఆటపట్టించడం వీరేంద్ర సెహ్వాగ్‌కి ఒక దినచర్యగా మారింది. గతంలో సచిన్‌తో పాటు కోహ్లీని కూడా టార్గెట్ చేసి సోషల్ మీడియాలో నవ్వులు పూయించిన వీరూ ఈసారి వికెట్ కీపర్ పార్థివ్ పటేల్‌ని టార్గెట్ చేశాడు. ఒక ప్లేటులో గ్లోవ్స్ ఆకారంలో ఉన్న రోటీలను పెట్టి పార్థివ్ పటేల్‌కు ట్యాగ్ చేశాడు. "తమ్ముడూ చూశావా.. ఈ గ్లోవ్స్ భలే ఉన్నాయి కదా.. నీకు పంపించమంటావా" అని ట్వీట్ కూడా చేశాడు. అయితే ఇదే ట్వీట్ చేయకముందు నెటిజన్లకు కూడా ఆయన ఈ ఫోటో విషయమై ట్వీట్ చేశారు.

"కొత్తగా పెళ్లయ్యాక, భర్త భార్యతో ఇలా అన్నాడు. "నీ చేతి రోటీలు తినాలని ఉంది" అని. ఆయన కోరికను ఈమె ఈ విధంగా తీర్చింది" అని చేతుల ఆకారంలో ఉన్న రోటీల ఫోటోలను ట్వీట్ చేశాడు సెహ్వాగ్. ఏదేమైనా..రిటైర్ అయ్యాక, సెహ్వాగ్‌లో ఉన్న హాస్య చతురత పదిమందికీ తెలుస్తోంది అంటున్నారు నెటిజన్లు. అయితే ఈ ట్వీట్ పై పార్థివ్ కూడా బాగానే స్పందించాడు. "నా చేతి సైజుకి తగ్గ గ్లౌజులు నా దగ్గర చాలానే ఉన్నాయి. మీ గ్లౌజులు మీరే ఉంచుకోండి. పైగా ఢిల్లీలో చలి ఎక్కువగా ఉంది. మీ ఇంట్లో ఎవరికైనా మీ గ్లౌజులు ఉపయోగపడచ్చు" అని పార్థివ్ ట్వీట్ చేశాడు