వీడియో: ముంబైలో గల్లీ క్రికెట్ ఆడిన సచిన్

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా.. సచిన్‌ టెండూల్కర్‌‌కు క్రికెట్ నుంచి ఎవరూ దూరం చేయలేరని మరోసారి స్పష్టమైంది.

Updated: Apr 17, 2018, 12:07 PM IST
వీడియో: ముంబైలో గల్లీ క్రికెట్ ఆడిన సచిన్

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా.. సచిన్‌ టెండూల్కర్‌‌కు క్రికెట్ నుంచి ఎవరూ దూరం చేయలేరని మరోసారి స్పష్టమైంది. క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే సచిన్ ఏమాత్రం తీరిక దొరికినా క్రికెట్ ఆడేందుకు ఆసక్తిని చూపిస్తుంటాడు. తాజాగా ముంబైలో ఓ రోడ్డు పక్కన ఆడిన క్రికెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోను సచిన్‌ బాల్య స్నేహితుడు వినోద్‌ కాంబ్లి తన ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ముంబయిలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతమైన విల్లే పార్లీలోని దయాల్‌దాస్‌ రోడ్డులో సచిన్‌ క్రికెట్‌ ఆడినట్లు తెలుస్తోంది. సచిన్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా, కొంత మంది యువకులు ఫీల్డింగ్‌ చేశారు. రోడ్డుపైనే క్రికెట్‌ ఆడుతుండటంతో వికెట్లుగా ప్లాస్టిక్‌ డివైడర్‌ని వాడారు. సచిన్‌తో క్రికెట్‌ ఆడింది స్థానిక హోటల్‌ సిబ్బందిగా తెలుస్తోంది. రాత్రి రోడ్డుపై క్రికెట్‌ ఆడుతున్న సచిన్‌ను అటుగా కారులో వెళ్తున్న ఓ చిన్నారి గుర్తుపట్టి సచిన్‌ సచిన్‌ అని పిలిచింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

 

ప్రస్తుతం సచిన్‌ ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ జట్టుకు మెంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ రోజు బెంగళూరు జట్టుతో సొంతగడ్డపై ముంబయి ఇండియన్స్‌ తలపడనుంది.