చాహల్, క్రిస్ గేల్ ట్విట్టర్ ముచ్చట్లు

లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఈ రోజు ట్విట్టర్‌లో పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. 

Updated: Jan 10, 2018, 04:44 PM IST
చాహల్, క్రిస్ గేల్ ట్విట్టర్ ముచ్చట్లు
(Photo: BCCI)

లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఈ రోజు ట్విట్టర్‌లో పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. తాను వ్యాయామం చేస్తున్న వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన చాహల్ ఆ తర్వాత దానిపై వచ్చిన కామెంట్లకు కూడా రిప్లై ఇచ్చారు.

 

Make each day count. Get better everyday #newyear #newgoals

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) on

ముఖ్యంగా తనతో పాటు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఆడిన షమ్సీ కామెంటు చేస్తూ "అబ్బో.. ఈ వీడియోలో ఉంది చాహలా లేదా క్రిస్ గేలా" అని కామెంట్ చేయగా.. దానికి చాహల్ కూడా బదులిచ్చాడు. "నేను క్రిస్ గేల్ కన్నా ఎక్కువ బరువు ఎత్తానోచ్" అని చాహల్ ఫన్నీగా జవాబివ్వగా.. ఊహించని రీతిలో ఈ పోస్టుపై క్రిస్ గేల్ కూడా స్పందించారు. "నన్ను చంపేయండి.." అన్నాడు. దాంతో చాహల్ పోస్టు మొత్తం నవ్వులతో నిండిపోయింది.