అలర్ట్: కోడిగుడ్డు పగిలితే కారు ఆపొద్దు

రాత్రుళ్లు కారు నడుపుతున్నారా!! తస్మాత్ జాగ్రత్త..!

Last Updated : Feb 5, 2018, 07:21 PM IST
అలర్ట్: కోడిగుడ్డు పగిలితే కారు ఆపొద్దు

కారు నడిపే వారిని అప్రమత్తం చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. రాత్రుళ్లు కార్లపై కోడిగుడ్డు దాడులు ఎక్కువవుతున్న నేపథ్యంలో పోలీసులు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. కోడిగుడ్డు పగిలితే కారు ఆపొద్దని హెచ్చరిస్తున్నారు.

ఈమధ్య హైదరాబాద్ పరిసరాల్లో దుండగులు కాపుకాసి మరీ కార్లపై దాడులకు తెగబడుతున్నారు. కోడిగుడ్లను కారు అద్దంపై పగులగొట్టి దొరికింది దోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు కోడిగుడ్డు పగిలినా కారు అపోద్దని వాహన చోదకులకు సూచించారు. వైపర్ ఆన్ చేసి నీళ్లతో కారు అద్దాలను కడగాలనే ప్రయత్నం చేయవద్దని చెప్పారు. అలా చేస్తే కోడిగుడ్డు రసాయనాలు నీళ్లతో కలిసి పోయి వెంటనే కారు అద్దం నల్లబడుతుందని.. బయట అంతా చీకటిగా కనపడుతుందని చెప్పారు. అప్పుడు మీరు తప్పనిసరిగా కారు ఆపవలసి వస్తుందని.. ఆ సమయంలో దోపిడీ దొంగలు దాడి చేసి మీ వద్ద ఉన్న డబ్బులు, నగలు, ఇతర విలువైన సొత్తును దోచుకెళ్తారని చెప్పారు. ఇలాంటి సమయాల్లో కారు ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దని.. అక్కడి నుండి తప్పించుకోవాలనే ప్రయత్నం చేయాలని పోలీసులు వివరించారు.

Trending News