పట్టపగలే ఇంటర్ విద్యార్థి దారుణ హత్య

సోమవారం ఉదయం హైదరాబాదు నగరంలోని కూకట్‌పల్లిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

Updated: Mar 13, 2018, 06:35 PM IST
పట్టపగలే ఇంటర్ విద్యార్థి దారుణ హత్య

సోమవారం ఉదయం హైదరాబాదు నగరంలోని కూకట్‌పల్లిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.  కొందరు దుండగులు ఇంటర్‌ విద్యార్థి సుధీర్ ఎర్రగల్లా(17)ను వెంటాడి వేటకొడవళ్ళతో నరికి చంపారు.

పోలీసుల కథనం ప్రకారం.. కూకట్‌పల్లిలోని ఓ  జూనియర్  కాలేజీలో ఇంటర్ చదువుతున్న సుధీర్.. సోమవారం ఉదయం పరీక్ష రాసేందుకు తోటి విద్యార్థులు మేఘనాథ్, సాయిలతో కలిసి బైక్‌పై వెళ్లాడు. వాళ్లు కూకట్‌పల్లి బిజీ రోడ్డు (జేఎస్‌పీ హోండా షోరూం) వద్దకు చేరుకోగానే అప్పటికే కాపుకాసి ఉన్న నలుగురు దుండగులు సుధీర్‌పై వేటకొడవళ్ళతో దాడి చేశారు. తప్పించుకుని పారిపోతున్న అతడిని వెంటాడి నరికి చంపేశారు. వారిని అడ్డగించేందుకు ప్రయత్నించిన తోటి విద్యార్థులపై కూడా దాడికి ప్రయత్నించటంతో వారు అక్కడి నుండి పారిపోయారు.

హత్య చేసిన అనంతరం అక్కడి నుండి పారిపోతున్న నలుగురు దుండగులలో ఒకరిని.. అదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఓ హోంగార్డ్ వెంటపడి పట్టుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి.. ఆ తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.