టీఆర్ఎస్‌ని బతికిస్తోంది ఆయనే: కోమటిరెడ్డి

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు లేకుంటే బావా, బావమరుదులు (కేటీఆర్, హరీష్‌రావులను ఉద్దేశిస్తూ) రోడ్డెక్కి కొట్టుకునే పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ - 'మంత్రులు కేటీఆర్, హరీష్‌రావుల మధ్య విభేదాలు ఉన్నాయి. హరీష్ ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కి కేటీఆర్ డుమ్మా కొట్టి బెంగళూరుకు వెళ్లి సినిమా చూసొచ్చాడు' అని ఆరోపించారు. హరీష్ వల్లే టీఆర్ఎస్‌ పార్టీకి నాలుగు ఓట్లు పడుతున్నాయన్నారు. ఆరు నెలలు ఆగితే మంత్రి జగదీష్‌రెడ్డికి అడ్రస్ ఉండదని.. ఆయన మళ్లీ చీప్ లిక్కర్ అమ్ముకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు.

జగదీష్‌రెడ్డి నోటికి ఎదోస్తే అది మాట్లాడుతున్నాడని, తనపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకేసులో జగదీష్ రెడ్డి పాత్ర లేకపోతే కేసీఆర్‌‌తో సీబీఐకి సిఫార్సు చేయించాలని డిమాండ్ చేశారు. మదన్‌మోహన్ రెడ్డి హత్యకేసులో, నూకాబిక్షం, కడారి రాంరెడ్డి హత్యల కేసుల్లో జగదీష్ రెడ్డి ముద్దయికాదా? అని ప్రశ్నించారు.

English Title: 
Komati Reddy Venkat Reddy Comments KTR And Harish Rao
News Source: 
Home Title: 

టీఆర్ఎస్ బతుకుతోంది ఆయనవల్లే

టీఆర్ఎస్‌ని బతికిస్తోంది ఆయనే: కోమటిరెడ్డి
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes