సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్‌కి పెరుగుతున్న అభిమానులు

కేటీఆర్ ట్విటర్ ఖాతాలో మరో మైలురాయి

Updated: Feb 9, 2018, 10:20 PM IST
సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్‌కి పెరుగుతున్న అభిమానులు

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో మరో అరుదైన మైలురాయిని అధిగమించారు. ప్రభుత్వ పథకాలు, పాలసీలు, కొత్తగా రాష్ట్రానికి రానున్న ఉపాధి అవకాశాలు, పెట్టుబడుల వివరాలు, ప్రముఖులతో భేటీల ముఖ్యాంశాలను ఎప్పటికప్పుడు ట్విటర్ ద్వారా ఫాలోవర్స్‌తో పంచుకునే కేటీఆర్‌కి సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వుందని ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే, ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అంశం ఏదైనా వుందా అంటే అది ఆయన ఖాతాలో ఫాలోవర్స్ సంఖ్య 1 మిలియన్‌కి చేరుకోవడమే. అవును, సినీ సెలబ్రిటీలు కాకుండా మనదేశంలోని ప్రజాప్రతినిధుల్లో అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యపడిన ఈ మిలియన్ ఫాలోవర్స్ మైలురాయి ఇప్పుడు మంత్రి కేటీఆర్ ఖాతాలో చేరింది.

 

అప్పుడప్పుడు తన అభిప్రాయాలను నెటిజెన్స్‌తో పంచుకుంటూ కేటీఆర్ ఇచ్చే సరదా సమాధానాలకు ప్రపంచవ్యాప్తంగా చాలామంది అభిమానులే వున్నారు. అందుకే కేటీఆర్ ట్విటర్ ఖాతాకు అంత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరి. తన ఖాతాలో ఫాలోవర్స్ సంఖ్య 1 మిలియన్‌కి చేరుకున్న సందర్భంగా మిలియన్ ఫాలోవర్స్‌కి మిలియన్ థాంక్స్ చెప్పిన కేటీఆర్.. లెట్స్ స్టే కనెక్టెడ్ అంటూ ట్వీట్ చేశారు.