తెలంగాణలో జనసేన వైఖరిని బయటపెట్టిన పవన్

తెలంగాణలో జనసేన స్టాండ్ ఎంటో తెలిసిపోయింది.

Last Updated : Jan 22, 2018, 07:12 PM IST
తెలంగాణలో జనసేన వైఖరిని బయటపెట్టిన పవన్

తెలంగాణలో పవన్ స్టాటజీ ఎలా ఉంటుందనే దానిపై నెలకొన్న సస్పెన్స్ కు పవన్ కల్యాణ్ సోమవారం తెరదించేశారు. తెలంగాణ పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం కొండగట్టులో పర్యటించిన పవన్ .. సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలతో గొడవపెట్టుకునే ఉద్దేశం లేదని వెల్లడించారు.  అధికారపక్షంపై ఎలా పడితే అలా విమర్శలు చేసే వ్యక్తిని కాదని తెలిపారు. ప్రజా సమస్యలు అధ్యయనం చేసి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. జనసేన చిన్నపార్టీ.. ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోందన్నారు. కార్యకర్తలు సూచనలు, సలహాల మేరకు పార్టీ కార్యక్రమాలు చేపడతామని పవన్ వెల్లడించారు.

గతంలో సీఎం కేసీఆర్ కు అనుకూల వైఖరిని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై విమక్షాల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. కాగా తెలంగాణ పర్యటన సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటి పవన్ కు ఎలాంటి అడ్డంకులు ఎదురుకాలేదు. తాజా పరిణామాలతొ పవన్ వైఖరి ముందే తెలిసినప్పటికీ ..ఇప్పుడు బహిరంగంగా ప్రకటించడంతో అసలు విషయం తేలిపోయింది.

Trending News