గజల్ శ్రీనివాస్‌పై లైంగిక వేధింపుల కేసు

గజల్స్ పాడి వినిపించడంలో ప్రముఖ కళాకారుడిగా పేరున్న గజల్ శ్రీనివాస్‌పై పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది.

Updated: Jan 2, 2018, 01:01 PM IST
గజల్ శ్రీనివాస్‌పై లైంగిక వేధింపుల కేసు

గజల్స్ పాడి వినిపించడంలో ప్రముఖ కళాకారుడిగా పేరున్న గజల్ శ్రీనివాస్‌పై పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. గత ఏడాది కాలంగా గజల్ శ్రీనివాస్ తనని లైంగికంగా వేధిస్తున్నాడని ఆలయవాణి వెబ్ రేడియోలో జాకీగా పనిచేస్తోన్న ఓ యువతి అతడిపై డిసెంబర్ 29న పంజాగుట్ట పోలీసులకి ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిన్న సాయంత్రం గజల్ శ్రీనివాస్‌పై కేసు నమోదైంది.

ప్రస్తుతం గజల్ శ్రీనివాస్ పంజాగుట్ట పోలీసుల అదుపులో వుండగా కొద్దిసేపటి క్రితమే అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఇంకొద్దిసేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం అందుతోంది. గజల్ శ్రీనివాస్ తనని వేధిస్తున్నాడని నిరూపించేందుకు తగిన ఆధారాలు సైతం తన వద్ద వున్నాయని బాధితురాలు పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close