హైదరాబాద్ 'నుమాయిష్' విశేషాలివే..!

నుమాయిష్.. హైదరాబాద్‌లో ప్రతీ సంవత్సరం జరిగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన. 

Updated: Jan 1, 2018, 05:33 PM IST
హైదరాబాద్ 'నుమాయిష్' విశేషాలివే..!

నుమాయిష్.. హైదరాబాద్‌లో ప్రతీ సంవత్సరం జరిగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన. ఈ ఏడాది ఈ ప్రదర్శన జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజులపాటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరగనుంది. గత సంవత్సరం దాదాపు 20 లక్షల మంది ఈ ప్రదర్శనకు వచ్చారని అంచనా. ఈ సంవత్సరం ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.  అసలు నుమాయిష్ పూర్వాపరాలు.. దాని విశేషాలు ఏమిటో మనం కూడా తెలుసుకుందాం

*1938, ఏప్రిల్‌ 6 తేదిన అప్పటి ముల్కి ఉస్మాన్‌ అలీఖాన్‌ జన్మదినం సందర్భంగా పబ్లిక్‌ గార్డెన్‌లో తొలిసారిగా నుమాయిష్‌ను ప్రారంభించారు. 

*అప్పట్లోనే దాదాపు 3 లక్షల రూపాయలతో 100 పైగా స్టాల్స్‌తో నుమాయిష్‌ను ఏర్పాటు చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ స్టాల్స్‌ సంఖ్య దాదాపు 3 వేలకు పైగా పెరిగింది. 

*ఈ నుమాయిష్‌లో భాగంగా 150 నుండి 200 కోట్ల మేరకు వ్యాపారం జరుగుతుందని అంచనా.

*నుమాయిష్‌లో స్వదేశీ, విదేశీ వ్యాపారస్తులెందరో తమ పారిశ్రామిక ఉత్పత్తులను ప్రదర్శనకు పెడతారు.

*కాశ్మీర్ వస్త్రాల దగ్గర నుండి డ్రైఫ్రూట్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇరాన్ తివాచీలు.. ఇలా ఎన్నో ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి

*2012 వరకు పాకిస్తాన్ నుంచి కూడా వర్తకులు వచ్చి తమ సామాన్లను అమ్మేవారు. అయితే ఆ తర్వాత వారికి అనుమతిని నిరాకరించారు

*గత కొన్ని సంవత్సరాలుగా గేమింగ్ జోన్లు, ఫ్యాషన్ ఉత్పత్తులు, కార్పొరేట్, మల్టీనేషనల్ కంపెనీ ఉత్పత్తులతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన స్టాళ్లు కూడా నుమాయిష్‌లో కొలువుదీరడం ప్రారంభించాయి

*2018లో తొలిసారిగా ఎగ్జిబిషన్‌లో స్టాళ్లు ఏర్పాటు చేసుకొనే విక్రయదారులకు బీమా సౌకర్యాన్ని కల్పించింది ఎగ్జిబిషన్ సొసైటీ.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close