టీ-వ్యాలెట్‌తో ఆర్టీసీ టికెట్లు కొనవచ్చు

టీ-వ్యాలెట్ ద్వారా మరిన్ని లావాదేవీలు జరిపేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది

Last Updated : Aug 10, 2018, 09:10 AM IST
టీ-వ్యాలెట్‌తో ఆర్టీసీ టికెట్లు కొనవచ్చు

టీ-వ్యాలెట్ ద్వారా మరిన్ని లావాదేవీలు జరిపేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ వ్యాలెట్ ద్వారా ఈ-టికెట్లను బుక్ చేసే అవకాశం ఉండగా.. ఆగస్టు 9 నుంచి తమ కొత్త సేవలు అందుబాటులోకి వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.

టీఎస్‌ఆర్టీసీ టీ-వ్యాలెట్‌ అనుసంధాన ప్రక్రియను గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. దీనివల్ల ప్రయాణికులు బస్ టికెట్లను సులువుగా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చన్నారు. రోజుకు 13వేల టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచుతుండగా.. అందులో 6వేల టికెట్లు ఆన్లైన్ ద్వారానే అమ్ముడైతున్నాయని.. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసుల సంఖ్యను రానున్న రోజుల్లో పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. సమావేశంలో ఆర్టీసీ ఇన్‌ఛార్జి మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌శర్మ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పురుషోత్తం నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

కాగా టీ-వ్యాలెట్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకొనేవారికి ఈమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ తప్పనిసరి. టికెట్ బుక్ చేసుకున్న వెంటనే ప్రయాణీకుడి ఫోన్‌కి మెసేజ్, ఈ-మెయిల్‌కు ఈ టికెట్ వస్తుంది.

Trending News