Gajwel constituency result : గజ్వెల్ నుంచి గెలిచిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్

గజ్వెల్ నుంచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలుపు

Last Updated : Dec 11, 2018, 02:18 PM IST
Gajwel constituency result : గజ్వెల్ నుంచి గెలిచిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణలో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ముఖ్యంగా అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీచేసిన గజ్వెల్ నియోజకవర్గం మొదటి నుంచి ఓ హాట్ సీట్‌ని తలపించింది. ఇక్కడ గెలుపు ఎవరిది అనే చర్చ మొదటి నుంచి రక్తి కట్టించింది. అంతిమంగా ఇక్కడ టీఆర్ఎస్ బాస్ కేసీఆర్ విజయం సాధించినట్టు తాజాగా వెల్లడైన ఫలితాలు స్పష్టంచేస్తున్నాయి. కేసీఆర్ తన ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డిపై 50,000కుపైగా మెజార్టీతో కేసీఆర్ గెలుపొందినట్టు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది.

Trending News