ఎన్ఎస్ఎస్ విజేతలను ప్రశంసించిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారం ఎన్ఎస్ఎస్ విజేతలను ప్రశంసించారు.

Updated: Jan 3, 2018, 07:24 PM IST
ఎన్ఎస్ఎస్ విజేతలను ప్రశంసించిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు బుధవారం ఎన్ఎస్ఎస్ విజేతలను ప్రశంసించారు. కేంద్రం నుండి విశిష్ట ఎన్ఎస్ఎస్ అవార్డులను అందుకున్న వాలంటీర్లను అభినందించారు. 2016-17 సంవత్సరానికిగాను కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వశాఖ నుండి తెలంగాణ రాష్ట్రం నాలుగు అవార్డులను అందుకుంది. 

ది బెస్ట్ యూనిట్ అవార్డును ఘట్కేసర్ కు చెందిన అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేడ్చల్ గెలుచుకుంది. ది బెస్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ అవార్డును అనురాగ్ గ్రూప్‌కు చెందిన సి.మల్లేష్‌కు, బెస్ట్ వాలంటీర్ అవార్డులను ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్‌కు చెందిన టి. నవీన్, జేఎన్టీయూకు చెందిన పి. లలిత్ ఆదిత్యకు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పళ్ల రాజేశ్వర్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ మాజీ రాష్ట్ర ఎన్ఎస్ఎస్ అధికారి  డా.ఎంఎస్ఎన్.రెడ్డి పాల్గొన్నారు.