ఏపీకి నా మద్దతు: తెలంగాణ ఎంపీ కవిత

ఏపీ ఎంపీలు కేంద్రంపై తీసుకొస్తున్న ఒత్తిడిలో న్యాయముందని తెలంగాణ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు.

Updated: Feb 8, 2018, 07:10 PM IST
 ఏపీకి నా మద్దతు: తెలంగాణ ఎంపీ కవిత

ఏపీ ఎంపీలు కేంద్రంపై తీసుకొస్తున్న ఒత్తిడిలో న్యాయముందని తెలంగాణ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ విషయంలో ఏపీకి తెలంగాణ వైపు నుండి పూర్తి మద్దతు ఉంటుందని ఆమె తెలిపారు. ఇదే విషయంపై లోక్‌సభలో ప్రసంగించిన కవిత ఇరు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను వెంటనే మోదీ సర్కార్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు. సాక్షాత్తు ఎన్డీయే మిత్రపక్షమే ఆందోళనకు దిగడం వల్ల ప్రభుత్వం పై ప్రజలకు నమ్మకం పోతుందని.. ఇది మంచి పరిమాణం కాదని తాము భావిస్తున్నామని కవిత తెలిపారు. బడ్జెట్‌ వల్ల ప్రజలకు కేంద్రం ఇచ్చిందంటూ ఏమీ లేదని ఆమె అన్నారు. తెలంగాణకి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలన్నది తెలంగాణ వైపు నుండి తన డిమాండ్ అని కవిత తేల్చి చెప్పారు.