వెబ్‌సైట్‌లో 10వ తరగతి పరీక్షల హాల్ టికెట్లు

తెలంగాణ ప్రభుత్వం పదవ తరగతి పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేసింది.

Updated: Mar 11, 2018, 08:19 AM IST
వెబ్‌సైట్‌లో 10వ తరగతి పరీక్షల హాల్ టికెట్లు

తెలంగాణ ప్రభుత్వం పదవ తరగతి పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వ పరీక్షలు డైరెక్టరేట్, టీఎస్-ఎస్ఎస్సీ (తెలంగాణ స్టేట్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్) ఆధ్వర్యంలో మార్చి 2018 పరీక్ష హాల్ టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల అయ్యాయి. మరింత సమాచారం కోసం అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్‌ను సందర్శించవచ్చు(bse.telangana.gov.in.).

రెగ్యులర్, ప్రైవేట్, వోఎస్ఎస్సీ, ఒకేషనల్ అభ్యర్థులకు హాల్ టికెట్లను విడుదల చేశారు. తెలంగాణ ఎస్ఎస్సీ 2018 పరీక్షలు మార్చి 15 నుండి ఏప్రిల్ 2 వరకు జరుగుతాయి.

విద్యార్థులు ఎస్ఎస్సీ 2018 హాల్ టిక్కెట్లను ఈ క్రింది విధంగా డౌన్లోడ్  చేసుకోండి.

 * తెలంగాణ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ అధికారిక వెబ్‌సైట్‌ కు వెళ్ళండి: bse.telangana.gov.in.

 * SSC మార్చి 2018 హాల్ టికెట్స్ లింక్ పై క్లిక్ చేయండి.

 * మీరు రెగ్యులర్, ప్రైవేట్, వోఎస్ఎస్సీ, ఒకేషనల్.. ఇలా ఏ స్థాయిలో నమోదయ్యారో.. ఆయా సంబంధిత సమాచారాన్ని అందించే లింక్ పై క్లిక్ చేయండి.

 * జిల్లా, పాఠశాల, పేరు, పుట్టిన తేదీ వివరాలను సరిగ్గా నమోదు చేయండి. 'డౌన్లోడ్ హాల్ టికెట్' పై క్లిక్ చేయండి.

 * హాల్ టికెట్‌ను సేవ్ చేసి, ప్రింట్ అవుట్ తీసుకోండి.