తెలంగాణ టీడీపీ మేనిఫెస్టో విడుదల, నిరుద్యోగులకు పెద్దపీట

                       

Last Updated : Nov 21, 2018, 03:17 PM IST
తెలంగాణ టీడీపీ మేనిఫెస్టో విడుదల, నిరుద్యోగులకు పెద్దపీట

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా టి.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ చేతుల మీదుగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలోపెట్టుకొని మేనిఫెస్టో రూపకల్పన చేశామన్నారు.  ఆర్ధికంగా బలంగా ఉన్నతెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని విమర్శించారు. ఈ సందర్భంగా రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనతో అన్ని వర్గాలు ప్రజలు అసంతృప్తితో ఉన్నారని విమర్శించారు. జనాల సమస్యలను దృష్టిలో పెట్టుకొని మేనేఫెస్టో తయారు చేశామన్నారు. తమ మేనిఫెస్టోలో అమరవీరుల కుటుంబాలు, నిరుద్యోగులకు పెద్దపీట వేశామని తెలిపారు.

మేనిఫెస్టో వివరాలు: 

*  అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే లక్ష ఉద్యోగాలు భర్తీ
*  అమలవీరుల కుటంబాలకు ఇంటికో ఉద్యోగం
*  ప్రగతి భవన్ ప్రజా ఆస్పత్రిగా మార్పు
*  తెలంగాణ అమరవీరుల శాశ్వతి స్మృతి  చిహ్నం
*  వితంతువులు, 58 ఏళ్లు దాటిన వృద్ధులకు నెలకు రూ.2వేల పింఛన్ 
నిరుద్యోగులు, వికలాంగులకు రూ.3 వేల ఫించను
*  ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు
*  బీసీలకు ప్రత్యేక సబ్ ప్లాన్
*  8 నుంచి 10 టెన్త్ చదివే బాలికలకు ఉచిత సైకిళ్లు

*ఇంటర్ నుంచి వర్శిటీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు 
 * ఏటా ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రకటన
* రూ.2లక్షల వరకు రైతులకు రుణమాఫీ
* రుణమాఫీ కౌలు రైతులకు వర్తింపు
* అన్నా క్యాంటీన్ల ద్వారా రూ.5లకే భోజనం
* విభజన బిల్లులో అంశంపై కేంద్రంపై ఒత్తిడి
* అన్ని జిల్లాల్లో పూలే, అంబేడ్కర్ నాలెడ్జ్ కేంద్రాలు
* హైద్‌రాబాద్ ధర్నా చౌక్ పునరుద్దరణ

* లోకాయుక్త ఏర్పాటు, లోకాయుక్త పరిధిలోకి ప్రజాప్రతినిధులు
* నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు భృతి
* గ్రామాల్లోని బెల్ట్ షాపుల పూర్తి స్థాయిలో రద్దు 
* విద్యారంగానికి బడ్జెట్‌లో అదనంగా రూ.5వేల కోట్లు కేటాయింపు
* ప్రొఫెసర్ జయశంకర్ పేరిటి విద్యా సంస్థలు ఏర్పాటు

* పేద యువతుల వివాహానికి రూ.1.50 లక్షల ఆర్థికసాయం
* ఎస్సీ వర్గీకరణ కోసం కషి
* ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, బీసీలకు సబ్‌ప్లాన్ అమలు
* ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల సంక్షేమానికి చర్యలు
* పక్కా ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల సాయం
* ప్రతి ఇంటికీ మంచినీరు
* వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్

Trending News