తెలంగాణకు మినీ ఎయిర్‌పోర్టులు వచ్చేస్తున్నాయి

తెలంగాణ జిల్లాల్లో మినీ ఎయిర్ పోర్టులు నిర్మించడానికి టీసర్కార్ సిద్ధమవుతోంది.

Last Updated : Jul 13, 2018, 06:17 PM IST
తెలంగాణకు మినీ ఎయిర్‌పోర్టులు వచ్చేస్తున్నాయి

తెలంగాణ జిల్లాల్లో మినీ ఎయిర్ పోర్టులు నిర్మించడానికి టీసర్కార్ సిద్ధమవుతోంది. ముఖ్యంగా పెద్దపల్లి, మహబూబ్ నగర్, భోపాల్ పల్లి, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ ప్రాంతాలలో ఈ ఎయిర్ పోర్టులను ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఏవియేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా కొత్త ఎయిర్ పోర్టులకు సంబంధించి ప్రత్యేక స్టడీ చేసింది.

ఈ క్రమంలో తెలంగాణలో మినీ ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత గురించి పేర్కొంది. ఈ అంశంపై తదుపరి చర్చల నిమిత్తం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి ఓ సమావేశం కూడా నిర్వహించారు. ఈ క్రమంలో ఎయిర్ పోర్టుల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి తగిన వనరులు సమకూర్చడానికి ముందుకొస్తున్నట్లు తెలిపారు. 

రాష్ట్రానికి వచ్చే దేశీయ, విదేశీ యాత్రికులు రోజు రోజుకీ పెరుగుతున్న క్రమంలో మినీ ఎయిర్ పోర్టుల విషయానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నట్లు సమావేశంలో ఎస్ కే జోషి తెలిపారు. గతంలో ఆంధప్రదేశ్‌లోని దొనకొండ ప్రాంతంలో కూడా మినీ ఎయిర్ పోర్టు నిర్మించే నిమిత్తం.. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చి స్థలాన్ని పరిశీలించింది. భౌగోళిక పరిస్థితులు, అనుకూలతలను బట్టి ఈ స్థలాలను కేటాయించే అవకాశం ఉందని గతంలో వారు తెలిపారు. 

Trending News