టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోమారపు పొలిటికల్ రిటైర్డ్‌మెంట్ !

రామగుండం నియోజవర్గానికి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఈ రోజు సంచలన ప్రకటన చేశారు.  టీఆర్ఎస్ హైకమాండ్ తీరుపై అసంతృప్తితోనే తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

Updated: Jul 9, 2018, 04:55 PM IST
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోమారపు పొలిటికల్ రిటైర్డ్‌మెంట్ !

కరీంనగర్: రామగుండం నియోజవర్గానికి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఈ రోజు సంచలన ప్రకటన చేశారు. తాను ఇక పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చానని పేర్కొన్నారు. టీఆర్ఎస్ హైకమాండ్ తీరుపై అసంతృప్తితోనే ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ప్రముఖ మీడిమా కథనం ప్రకారం... ఈ రోజు ఉదయం సింగరేణి కార్మికులతో ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ భేటీ నిర్వహించారు. ఈ భేటీలో మాట్లాడుతూ తనకు టీఆర్‌ఎస్‌లో గౌరవం లేదని..పార్టీలో అవినీతిపరులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గానికి తాను చేయాలనుకున్న పనులు చేయలేకపోతున్నానని అందుకే పొలిటికల్ రిటైర్‌మెంట్ తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చానని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సోమరపు మాట్లాడుతూ తనకు ఆర్టీసీ చైర్మన్‌ పదవి ఇచ్చినా అధికారాలు ఇవ్వలేదని సోమరపు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సోమారపు సత్యనారాయణ మేయర్‌ అవిశ్వాస పరిణామాలపై సోమారపు సత్యనారాయణ అసంతృప్తికి కారణమని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి.