భజరంగ్ దళ్ హెచ్చరికలు; షీ-టీంలు అలర్ట్

ప్రతి సంవత్సరం కోరుతున్నట్లే భజరంగ్ దళ్ ఫిబ్రవరి 14 న 'వాలెంటైన్స్ డే' ను బహిష్కరించాలని కోరుతూ హైదరాబాద్‌లోని పబ్బులు, రెస్టారెంట్లను సందర్శిస్తున్నారు.

Updated: Feb 14, 2018, 01:49 PM IST
భజరంగ్ దళ్ హెచ్చరికలు; షీ-టీంలు అలర్ట్

ప్రతి సంవత్సరం కోరుతున్నట్లే భజరంగ్ దళ్ ఫిబ్రవరి 14 న 'వాలెంటైన్స్ డే'ను బహిష్కరించాలని కోరుతూ హైదరాబాద్‌లోని పబ్బులు, రెస్టారెంట్లను సందర్శిస్తున్నారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా జరిగే ఈ విష సంస్కృతి సంబరాల్లో యువతీ, యువకులు పాల్గొనకూడదని కోరుతూ నగరంలోని కళాశాలలను కూడా సందర్శించారు.

"మన దేశ సంస్కృతి చాలా గొప్పది. 'వాలెంటైన్స్ డే' కారణంగా యువత పెడదారి పడ్డారు. అందుకే నగరంలో ఉన్న పబ్బులు, కళాశాలలకు వెళ్లి 'వాలెంటైన్స్ డే' సంబరాల్లో పాల్గొనకూడదని కోరుతున్నాము" అని భజరంగ్ దళ్ రాష్ట్ర కో-కన్వీనర్ సుభాష్ చందర్ చెప్పారు. విద్యార్థులు 'వాలెంటైన్స్ డే' ను జరుపుకుంటున్నట్లయితే వారికి కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పారు. మంగళవారం భజరంగ్ దళ్ కార్యకర్తలు 'జంటలు కనిపిస్తే పెళ్లి చేస్తాం' అని హెచ్చరించారు. 

'షీ' టీంలు అలర్ట్

వాలంటైన్స్ డే సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కీలకమైన ప్రాంతాలలో ప్రత్యేక నిఘా పెట్టారు. పార్కులు, మల్టీప్లెక్స్ లు, హోటళ్లు, పబ్బుల వద్ద జంటలు కనిపిస్తే పెళ్లి చేస్తాం అన్న భజరంగ్ దళ్ హెచ్చరికల నేపథ్యంలో షీ టీం, పోలీసులు అప్రమత్తమయ్యారు.