అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి!

అమెరికాలో గన్ కల్చర్‌కి అంతు లేకుండాపోయింది. భారతీయులు అధికంగా వున్న క్యాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్‌కి సమీపంలో వున్న ఓ మార్కెట్‌లో తుపాకీతో

Updated: Dec 30, 2017, 01:19 PM IST
అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి!

అమెరికాలో గన్ కల్చర్‌కి అంతు లేకుండాపోయింది. భారతీయులు అధికంగా వున్న క్యాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్‌కి సమీపంలో వున్న ఓ మార్కెట్‌లో తుపాకీతో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో అనేకమంది గాయపడగా మొత్తం ఇద్దరు మృతిచెందారు. మృతి చెందిన వారిలో ఓ పౌరుడు సహా దుండగుడు కూడా వున్నారు. క్యాలిఫోర్నియా స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 2:25 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన క్యాలిఫోర్నియా వాసులని ఉలిక్కిపడేలా చేసింది. 

కాల్పులు జరిగిన రెండంతస్తుల భవనంలోంచి పౌరులు బయటికి పరుగులు తీస్తున్న దృశ్యాన్ని పలు స్థానిక మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. కాల్పుల్లో తనని తాను గాయపర్చుకున్న నిందితుడు అక్కడికక్కడే మృతిచెందినట్టు తెలుస్తోంది. కాల్పులు జరిగిన రెండు అంతస్తుల భవనంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు కూడా వున్నట్టు సమాచారం. కాల్పుల అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ భవనాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.