11 మంది సౌదీ రాజులు అరెస్ట్

సౌదీ అరేబియాకు చెందిన ఒక న్యూస్ ఏజెన్సీ 11 మంది సౌదీ రాకుమారులను అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసినట్లు తెలిపింది.

Updated: Jan 8, 2018, 01:22 PM IST
11 మంది సౌదీ రాజులు అరెస్ట్

సౌదీ అరేబియాకు చెందిన ఒక న్యూస్ ఏజెన్సీ 11 మంది సౌదీ రాకుమారులను అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసినట్లు తెలిపింది. ఒక రాజభవనం ఎదుట నిరసన ప్రదర్శించడంతో పాటు.. అక్కడి నుండి వెళ్లిపోండి అని సెక్యూరిటీ ఎంతచెప్పినా వినకపోవడంతో వారికి అరెస్ట్ చేసినట్లు తెలిపింది. 

రాజకుటుంబానికి చెందిన భద్రతా బలగాలు వారిని అరెస్ట్ చేసినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి చెప్పాడని ఆ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.  తమ బంధువుకు సంబంధించిన ఒక కేసు తీర్పులో పరిహారం ఇవ్వాలని, రాజవంశీయులు నీటి, కరెంట్ బిల్లులను ప్రభుత్వం చెల్లించడాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. నిరసన ప్రదర్శించారు. కాగా వీరిని గరిష్ట భద్రతతో రియాద్‌లోని హైర్ జైలుకు తరలించారు. ఇది సౌదీ ఇంటలిజెన్స్ సర్వీసెస్ నిర్వహణలో ఉంది. ఈ జైలులో ఖైదీలు, మిలిటెంట్లు, ఆల్ -ఖైదా ఉగ్రవాదులు ఉన్నారు.