'మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధంగా ఉండండి': రష్యా టీవీ ఛానల్

సిరియాలో ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడటానికి రష్యన్లు మూడవ ప్రపంచ యుద్ధం కోసం సిద్ధంగా ఉండాలని రష్యా ప్రకటించింది.

Updated: Apr 15, 2018, 05:42 PM IST
'మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధంగా ఉండండి': రష్యా టీవీ ఛానల్

సిరియాలో ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడటానికి రష్యన్లు మూడవ ప్రపంచ యుద్ధం కోసం సిద్ధంగా ఉండాలని రష్యా ప్రభుత్వ టీవీ ఛానల్ ప్రకటించింది.

‘మూడో ప్రపంచ యుద్ధం వస్తోంది. ప్రజలారా! సిద్ధం కండి. బాంబ్‌ షెల్టర్లలో తలదాచుకొనే సమయంలో శరీరాన్ని ధార్మికత నుంచి కాపాడుకునేందుకు అయోడిన్‌ను కూడా దగ్గర ఉంచుకోండి. అవసరమైన ఇతర మందులు, నిత్యావసర వస్తువులనూ సిద్ధంగా ఉంచుకోండి’’ అని రష్యా ప్రజలకు ప్రభుత్వ టీవీ ఛానెల్‌ చెప్పింది. సిరియాపై అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు వైమానిక దాడులకు దిగిన నేపథ్యంలో రోసియా-24 చానెల్‌ ఈ మేరకు ఓ కథనాన్ని ప్రసారం చేసింది.

ప్రముఖ సైనిక విశ్లేషకుడు అలెగ్జాండర్ గోల్ట్స్ మాస్కోలో రైన్ టీవీతో మాట్లాడుతూ, "నేను  'ప్రచ్ఛన్న యుద్ధం'లో ప్రవేశించామని సంవత్సరం క్రితమే చెప్పినప్పుడు ఎవరూ నాతో ఏకీభవించలేదు ఇప్పుడు ప్రతిఒక్కరూ అంగీకరిస్తున్నారు' అన్నారు. ఈ రెండో ప్రచ్ఛన్న యుద్ధంలో సంఘటనలు వేగవంతంగా చోటు చోటుచేసుకున్నాయని అన్నారు. మేము ఇప్పటికే క్యూబా క్షిపణి సంక్షోభం 2.0ను కలిగి ఉన్నామని చెప్పారు.

అమెరికా క్షిపణి దాడుల అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అలెగ్జాండర్‌ గోల్ట్స్‌ ఈ హెచ్చరిక చేశారు. ‘యుద్ధసమయంలో ఆహార సరఫరాలో చాలా వస్తువులు ఉంటాయి. కానీ, తీపి పదార్థాలు తక్కువగా, నీరు ఎక్కువగా ఉంచుకోవాలన్నదే అత్యవసర నిల్వల ప్రధాన ఉద్దేశం. రైస్ ప్యాక్ చేసుకోవాలని, ఇది ఎనిమిదేళ్లు నిల్వ ఉంటుందని, అలాగే వోట్మీల్ మూడు నుండి ఏడు సంవత్సరాలు నిల్వ ఉంటుంద'ని కథనంలో ప్రేక్షకులకు సూచించారు.