ప్రపంచ కుబేరుడు అమెజాన్ 'జెఫ్‌ బెజోస్‌'

ఫోర్బ్స్‌ 2018 వరల్డ్‌ బిలియనీర్స్‌’ జాబితా వెలువడింది. మొదటి స్థానం అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్‌కు దక్కింది.

Updated: Mar 7, 2018, 11:59 AM IST
ప్రపంచ కుబేరుడు అమెజాన్ 'జెఫ్‌ బెజోస్‌'

ప్రపంచ ధనవంతుల జాబితాలో అగ్రస్థానం అమెజాన్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్‌ బెజోస్‌కు దక్కింది. బెజోస్‌ సంపద 112 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.7.28 లక్షల కోట్ల)ని ‘ఫోర్బ్స్‌ 2018 వరల్డ్‌ బిలియనీర్స్‌’ జాబితా తెలిపింది. 2017 సంపదతో పోలిస్తే, 39.2 బిలియాన్ డాలర్ల మేర పెరగడంతో ఆయన మొదటి స్థానానికి వెళ్లారని వెల్లడించింది. జెఫ్‌ బెజోస్‌కు మొదటి స్థానం దక్కడం ఇదే తొలిసారి.

బిల్ గేట్స్

గత 24 సంవత్సరాల్లో 18ఏళ్లపాటు మొదటి స్థానంలో ఉన్న బిల్ గేట్స్ రెండో స్థానానికి పడిపోయారు. ఆయన సంపద 90 బిలియన్ డాలర్లని, గతేడాది 86 బిలియన్ డాలర్లని పేర్కొంది.

వారెన్ బఫెట్

వారెంట్ బఫెట్ కు ‘ఫోర్బ్స్‌ 2018 వరల్డ్‌ బిలియనీర్స్‌’ జాబితాలో మూడో స్థానం దక్కింది. ఆయన సంపద 84 బిలియన్ డాలర్లు. నాలుగో స్థానంలో ఎల్విఎంహెచ్ సీఈవో బెర్నార్డ్ ఉన్నారు. ఆయన సంపద 84 బిలియన్ డాలర్లు.

మార్క్ జుకర్‌బర్గ్

ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ 71 బిలియన్ డాలర్ల సంపదతో ఐదో స్థానంలో నిలిచారు. ఈయన గతేడాది కూడా ఇదే స్థానంలో ఉన్నట్లు ఫోర్బ్స్‌ జాబితా వెల్లడించింది.

అమన్సియో ఆర్టేగా

అమన్సియో ఆర్టేగా గతేడాది కంటే 1.3 బిలియన్ డాలర్లు క్షీణించి 70 బిలియన్ డాలర్ల సంపదతో ఆరవ స్థానంలో నిలిచారు.

ముఖేష్ అంబానీ

భారత రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ 40 బిలియన్ డాలర్ల సంపదతో 19వ స్థానంలో నిలిచారు. అలీబాబాకు చెందిన జాక్ మా రౌండ్స్  39 బిలియన్ డాలర్ల సంపదతో 20వ స్థానంలో నిలిచారు.

డొనాల్డ్ ట్రంప్

గత ఏడాది 544వ స్థానంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది 766వ స్థానంతో సరిపెట్టుకున్నారు. మిడ్‌టౌన్‌ మన్‌హటన్‌ స్థిరాస్తి విలువలు, గోల్ప్‌ ఆస్తుల నుంచి ఆదాయాలు తగ్గడం వల్ల సంపద క్షీణించింది. 2017 పోలిస్తే, ట్రంప్‌ సంపద 400 మిలియన్‌ డాలర్లు తగ్గింది.