బ్రిటన్ మహారాణి.. మహ్మద్ ప్రవక్త వారసురాలా?

చరిత్ర అంటే అదే..! దాచేస్తే దాగదు. ఎప్పుడో ఒకసారి నిజం బయటకు వస్తుంది.

Updated: Apr 9, 2018, 04:16 PM IST
బ్రిటన్ మహారాణి.. మహ్మద్ ప్రవక్త వారసురాలా?

చరిత్ర అంటే అదే..! దాచేస్తే దాగదు. ఎప్పుడో ఒకసారి నిజం బయటకు వస్తుంది. తాజాగా  బ్రిటన్ మహారాణి రెండో ఎలిజబెత్ మూలాలపై సంచలన విషయం బయటపడింది.  ఎన్నో  పరిశోధనలు చేసిన తరువాత.. బ్రిటన్ మహారాణి వంశానికి.. ఇస్లాం మత స్థాపకుడైన మహ్మద్ ప్రవక్తకు మధ్య మూలాలను గుర్తించినట్లు ఓ విదేశీ వార్తాపత్రిక పేర్కొంది.  

డైలీ మెయిల్ ప్రకారం, బ్రిటిష్ రాచవంశ మూలాలను పరిశోధించే బుర్కేస్ పీరేజ్ సంస్థ మొదటిసారి 1986లో ఈ వివరాలను బయటపెట్టింది.  అయితే అప్పట్లో పెద్దగా చర్చ జరగలేదు.  తాజాగా  బ్రిటన్ మహారాణికి సంబంధించిన 43 తరాల వ్యక్తుల కుటుంబ వివరాలను శోధించి.. ఆమె మహ్మద్ ప్రవక్త సంతతి అని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. రాణి వంశవృక్షాన్ని అధ్యయనం చేయగా ఈ విషయం బయటిపడిందని పేర్కొంటున్నారు. తాజా అధ్యయన ఫలితాలను వివరిస్తూ..  ప్రవక్త కుమార్తె ఫాతిమాతో ఎలిజబెత్ IIకి నేరుగా రక్తసంబంధం ఉందని పేర్కొంది. మధ్యయుగాల కాలంలో స్పెయిన్‌లోని జన్యు సంబంధ రికార్డుల్లో ఈ విషయాన్ని రాసిపెట్టారని, మాజీ ఈజిప్టు గ్రాండ్ ముఫ్తీ అలీ గోమా ఇదే విషయాన్ని చెప్పేవారని పేర్కొంది.

'మహ్మద్ ప్రవక్త- రాణి మధ్య ఉన్న రక్తసంబంధం గురించి చాలా తక్కువ మంది బ్రిటీష్ ప్రజలకు తెలుసు. ఏదేమైనా ముస్లింలు ఈ వాస్తవాన్ని చూసి గర్విస్తున్నారు" అని బుర్కే  ప్రచురణ డైరెక్టర్, అప్పటి  ప్రధాని మార్గరెట్ థాచర్ 1986లో ఒక లేఖ రాశారు.

క్రైస్తవ మతంలోకి మారడానికి ముందు.. ప్రవక్త వంశానికి చెందిన జైదా అనే ముస్లిం రాకుమారి 11వ శతాబ్దంలో స్పెయిన్ నుంచి పారిపోయి బ్రిటన్‌కు చేరుకుందని, తన పేరును ఇజబెల్లాగా మార్చుకుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఇంకా కచ్చితమైన ఆధారాలను అన్వేషించాల్సి ఉందంటున్నారు.

జైదా, సెవిల్లె రాజు అల్-ముతమిద్ ఇబ్న్ అబ్బాస్ నాల్గవ భార్య. ఆమె 'సాంచో' ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తరువాత అతను 11వ శతాబ్దంలో ఎర్ల్ ఆఫ్ కేంబ్రిడ్జ్ వంశీయులను వివాహం చేసుకున్నాడని పేర్కొంది.

అయితే, జైదా యొక్క మూలాల గురించి తెలుసుకోవడానికి చరిత్రకారులు పోటీ పడుతున్నారు.  కొంతమంది ఆమె ప్రవక్త మహ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వంశీయుడైన, ఖలీఫా యొక్క కుమార్తెగా పేర్కొన్నారు. మరి కొందరు ఆమె తన కుటుంబంలోని వారితోనే వివాహం చేసుకుందని పేర్కొన్నారు.