పాక్ పిల్లోడి చేతిలో గన్; భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు

పాక్, దాని గూఢచారి సంస్థలు హఫీజ్ సయీద్ ను భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగించుకుంటున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో, పాకిస్తాన్ నగరాల్లో అతని సంస్థలకు ర్యాలీలను నిర్వహించుకోవడానికి అనుమతిస్తుంది.

Last Updated : Feb 13, 2018, 02:50 PM IST
పాక్ పిల్లోడి చేతిలో గన్; భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు

ముంబయి పేలుడు ప్రాధాన సూత్రధారి, తీవ్రవాద నాయకుడు హఫీజ్ సయీద్ నేతృత్వంలోని నిషేధించబడిన జమాత్-ఉద్-దావా (జేయూడీ), పిల్లలకు జిహాద్ శిక్షణ ఇప్పించి భారత్ కు వ్యతిరేకంగా ఉసిగొల్పెందుకు ప్రయత్నిస్తోంది.

ఇస్లామాబాద్ లో నిర్వహించిన ఒక ఊరేగింపులో, జమాత్-ఉద్-దావా నేత సదాఖత్ తన చిన్న కుమారుడి చేతికి తుపాకీ ఇచ్చి నడిపించాడు. కాశ్మీర్, పాకిస్తాన్ యొక్క అంతర్భాగం అని, కాశ్మీర్ విముక్తి కోసం మద్దతు కొనసాగుతుందని నిరసనకారులు ఒక బ్యానర్ ను కూడా పట్టుకున్నారు.

జేయూడీ అనేది లష్కర్-ఇ-తోయిబాలోని ఒక ఛారిటీ విభాగం. ఇది దక్షిణ ఆసియాలోని ఇస్లాం తీవ్రవాద సంస్థలలో అతిపెద్దది. పాకిస్థాన్, కాశ్మీర్ ప్రాంతాల పిల్లలను సంస్థలో చేర్చుకుంటుంది. భారతదేశం, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వ్యతిరేకంగా, జిహాద్ ను ప్రోత్సహిస్తుంది. ఈ సంస్థ, పాకిస్తాన్ అంతటా అనేక మదరసాలను (ఇస్లామిక్ మత పాఠశాలలను) నడుపుతుంది. పిల్లలకు బ్రెయిన్ వాష్  చేసి.. కాశ్మీర్ విముక్తి కోసం పవిత్ర యుద్ధంలో పాల్గొనాలని పిలుపునిస్తుంది.

దురదృష్టమేమిటంటే.. పాక్, దాని గూఢచారి సంస్థలు హఫీజ్ సయీద్ ను భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగించుకుంటున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో, పాకిస్తాన్ నగరాల్లో అతని సంస్థలకు ర్యాలీలను నిర్వహించుకోవడానికి అనుమతిస్తుంది.

ముంబయిలో నవంబరు 26, 2008 దాడుల తరువాత అమెరికా హఫీజ్ సయీద్ ను తీవ్రవాదిగా ప్రకటించింది. ఈ దాడుల్లో 166 మంది చనిపోయారు.

Trending News