54 చేతులు నరికి నది పక్కన పడేశారు..!

రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఓ భయానక సంఘటన చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలోని ఓ నది ఒడ్డున  ఒక బ్యాగు పోలీసుల కంటపడగా.. వారు దానిని తెరిచి చూశారు.

Updated: Mar 10, 2018, 08:14 PM IST
54 చేతులు నరికి నది పక్కన పడేశారు..!

రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఓ భయానక సంఘటన చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలోని ఓ నది ఒడ్డున  ఒక బ్యాగు పోలీసుల కంటపడగా.. వారు దానిని తెరిచి చూశారు. అందులో నరికిన చేతులు కనబడడంతో వారు షాక్ తిన్నారు. దాదాపు 54 చేతులు బ్యాండేజీలు, గ్లౌజులతో చుట్టబడి ఉండడం చూసి విస్తుపోవడం పోలీసుల వంతైంది. ఈ పని ఎవరు చేసుంటారా? అన్న కోణంలో ఆలోచిస్తున్నారు పోలీసులు. ఏదైనా ఆసుపత్రి నుండి తీసుకొచ్చి ఆ బ్యాగును అక్కడ పడేశారా.. అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు.

ఇదో మిస్టరీ కేసని.. ఆ చేతులపైనున్న వేలిముద్రలను పూర్తి స్థాయిలో సేకరిస్తే తప్పితే.. ఈ కేసులో తదుపరి విచారణ జరిగే అవకాశం లేదని సైబీరియా పోలీసులు అంటున్నారు. సైబీరియా ప్రాంతం ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉండడం వల్ల ఆ చేతులు పాడవ్వలేదు. ప్రభుత్వానికి తెలియకుండా.. ఏవైనా వైద్య  ప్రయోగాలు చేసే క్రమంలో ఈ చేతులు నరికారా? అన్న ప్రశ్న ప్రస్తుతం రష్యా మీడియాలో వ్యక్తమవుతుంది. గతంలో పలు భయానక సంఘటనలు సైబీరియా ప్రాంతంలో జరిగాయి. సాధారణంగా సైబీరియాలోని అమూర్ నది చేపలు పట్టే ఆసక్తి ఉన్నవారికి మంచి హాలీడే ప్రాంతం. అలాంటి పర్యాటక ప్రాంతంలో ఈ బ్యాగు దొరకడం కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. అలాగే ఈ నది చైనా సరిహద్దుకి సరిగ్గా 20 మైళ్ళ దూరంలో మాత్రమే ఉండడం గమనార్హం.