నేపాల్ తేయాకుకి అంతర్జాతీయ ఘనత

154 సంవత్సరాల చరిత్ర ఉన్న నేపాల్ తేయాకు ఆఖరికి అంతర్జాతీయ ట్రేడ్ మార్కుని దక్కించుకుంది. 

Updated: Feb 5, 2018, 04:21 PM IST
నేపాల్ తేయాకుకి అంతర్జాతీయ ఘనత

154 సంవత్సరాల చరిత్ర ఉన్న నేపాల్ తేయాకు ఆఖరికి అంతర్జాతీయ ట్రేడ్ మార్కుని దక్కించుకుంది. ఈ క్రమంలో నేపాల్ టీ పంపిణీదారుల పేరు మీద బ్రాండ్ లోగో కూడా ఆవిష్కరించుకోవచ్చని ట్రేడ్ మార్కు మంజూరు చేసే అధికార యంత్రాంగం తెలిపింది. ఇంతకు క్రితం నేపాల్ టీని వేరు వేరు పేర్లతో అమ్మకందార్లు మార్కెటింగ్ చేసేవారు. ఇప్పడు ఆ అవసరం లేదు.

నేపాల్ టీకి ట్రేడ్ మార్కు లభించింది కాబట్టి కామన్ బ్రాండ్ నేమ్‌తో దీనికి సంబంధించిన అమ్మకాలను అంతర్జాతీయ మార్కెట్‌లో చేపట్టవచ్చు. ఇటీవలే ఈ విషయాన్ని నేపాల్ టీ అండ్ కాఫీ డెవలప్‌మెంట్ బోర్డు ప్రకటించింది. వచ్చే నెలలో జరగబోయే అంతర్జాతీయ టీ ఫెస్టివల్‌లో నేపాల్ టీ బ్రాండ్ లేబుల్‌ని ఆవిష్కరించబోతున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. నేపాల్‌లో ఉన్న 44 జిల్లాలలో తేయాకు పంటలను పండించడమే అక్కడి ప్రజలకు ప్రధాన ఆధారం

నేడు భారత్‌తో పాటు కెనడా, జర్మనీ, అమెరికా, చైనా ప్రాంతాలకు తేయాకుని ఎగుమతి చేస్తోంది నేపాల్ ప్రభుత్వం. 2007లో తొలిసారిగా నేపాల్ అంతర్జాతీయ తేయాకు సంఘంలో సభ్యత్వం తీసుకుంది.ప్రతీ సంవత్సరం  వైశాఖ మాసంలోని 15వ రోజు నాడు నేపాల్, జాతీయ తేయాకు దినోత్సవంగా జరుపుకోవడం గమనార్హం.

ఈ సందర్భంగా నేపాల్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రతినిధి శంకర్ సప్కోతా స్పందిస్తూ "నేపాల్ టీ అంతర్జాతీయ ట్రేడ్ మార్కు దక్కించుకోవడంతో ఇక్కడి రైతులకు ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతున్నాం. రైతులకే కాదు యావత్ నేపాల్ తేయాకు రంగానికే దీని వల్ల మంచి జరుగుతుంది" అని ఆయన తెలిపారు.