ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కన్నుమూత

ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మరణించారు.

Updated: Mar 14, 2018, 11:30 AM IST
ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కన్నుమూత

ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మరణించారు. ఆయన వయసు 76 ఏళ్లు. కటుంబ సభ్యులు కొద్దిసేపటి కిందట ఈ విషయాన్ని తెలిపారు.ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తర్వాత అంతటి పరిశోధనలు చేసిన వ్యక్తిగా హాకింగ్‌కి పేరుంది. ఈయన చాలా కాలంగా పలు అవయవాలు పనిచేయక చక్రాల కుర్చీకే పరిమితమైనా.. శాస్త్ర పరిశోధన కొనసాగిస్తూనే ఉన్నారు.

స్టీఫెన్ విలియం హాకింగ్ సుప్రసిద్ధ ఆంగ్లేయ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త. కనీసం కదలడానికి సహకరించని శరీరం, చక్రాల కుర్ఛీకి అతుక్కుపోయిన మనిషి, కనీసం మాట్లాడటానికీ కంప్యూటర్ సహాయం... ఇవి ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ను గుర్తించడానికి ఆనవాళ్లు. మోతార్ న్యూరాన్ వ్యాధి శరీరాన్ని కబళిస్తున్నా... చేస్తున్న పనికి శరీరం సహకరించకపోయినా... కృష్ణబిలాలపై ఆయన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని చూపాయి. శాస్త్రవేత్తగానే కాక ఆయనపై ఆయనకున్న నమ్మకం, కలసిరాని విధిని తనకు అనుకూలంగా మార్చుకునే తత్వం నేటి యువతకు ఆదర్శం. స్టీఫెన్ హాకింగ్ ఓ సైద్డాంతిక భౌతిక శాస్త్రవేత్త. ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యునిగా సేవలందిస్తున్నారు. 2009లో ఆ పోస్టు నుంచి వైదొలగనున్నారు. ప్రస్తుతం మనం హాకింగ్స్ రేడియేషన్ గా పిలుస్తున్న కృష్ణ బిలాల రేడియేషన్ ను ప్రతిపాదించింది స్టీఫెన్ హాకింగే..!