ఎన్నికల్లో అభ్యర్థి 'ముఖం' చూసే ఓట్లేస్తున్నారు!

ప్రపంచంలో ఎక్కడైనా ఎన్నికల్లో అభ్యర్థి ఎవడైనా కానీ.. సమర్ధుడా? అతడు/ఆమె వల్ల ప్రజలకు మేలు చేకూరుతుందా? స్థానిక సమస్యలు గట్టెక్కుతాయా?.. లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఓటర్లు ఓట్లేస్తారనుకున్నా?

Last Updated : May 2, 2018, 03:15 PM IST
ఎన్నికల్లో అభ్యర్థి 'ముఖం' చూసే ఓట్లేస్తున్నారు!

ప్రపంచంలో ఎక్కడైనా ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా కానీ.. సమర్ధుడా? అతడు/ఆమె వల్ల ప్రజలకు మేలు చేకూరుతుందా? స్థానిక సమస్యలు గట్టెక్కుతాయా?.. లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఓటర్లు ఓట్లేస్తారనుకుంటాం? కానీ ఎన్నికల్లో కొందరు ఓటర్లు అభ్యర్థుల 'ముఖం' చూసి ఓట్లేస్తారని బ్రిటన్ పరిశోధకులు తెలిపారు. అభ్యర్థుల ముఖ కవలికలను, లుక్స్‌లను బట్టి.. వారు పనిచేస్తారా? లేదా? అని ఓ అభిప్రాయానికి వచ్చి ఓట్లేస్తున్నారట. ఎన్నికల్లో చూడ్డానికి బాగున్నా అసమర్థులైన నాయకులు గద్దెనెక్కుతున్నట్లు కెంట్‌, ఎక్సెటెర్‌ విశ్వవిద్యాలయాల పరిశోధకులు వెల్లడించారు.

ఇప్పుడు రాజకీయనాయకుల నాయకత్వ ప్రతిభ కంటే.. అందమైన ముఖానికి ఎంత ప్రాధాన్యం ఉందో తమ పరిశోధనలో తేలిందని అంటున్నాయి ఈ యూనివర్సిటీలు. ఇందులో భాగంగా ఓ అధ్యయనం కూడా నిర్వహించారు. యువతకు కొన్ని ఫోటోలు ఇచ్చి వివరాలు సేకరించారు. ఫోటోలో ఉన్నది రాజకీయ నాయకులు అని చెప్పకుండా వివరాలు సేకరించారు. ఆతరువాత అభ్యర్థులకు వచ్చిన రేటింగ్స్‌ను, ఎన్నికల్లో వారికి వచ్చిన ఓట్ల శాతాన్ని పోల్చి చూశారు. ఈ క్రమంలో అందంగా, స్మార్ట్ లుక్‌తో ఉన్న వారి పట్ల ఓటర్లు సానుకూలత వ్యక్తం చేశారని తెలిపారు. అయితే ఎన్నికల్లో గెలుపొంది పదవులు చేపట్టాక ఆ ఫోటోలో ఉన్న  నాయకులు అంత సమర్థులు కారని తేలిందని పరిశోధకులు వివరించారు.

Trending News