Fishing Ban In AP: ఆంధ్రప్రదేశ్‌లో ఆగిన చేపల వేట.. 61 రోజులు బంద్

Marine Fishing In Andhra Pradesh 65 Days Up To June 15th: ఆంధ్రప్రదేశ్‌లో చేపల వేట ఆగిపోనుంది. సంతానోత్పత్తి కోసం ఏపీలో చేపల వేటను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నేటి రాత్రి నుంచి సముద్రంలో వేట చేస్తే నేరమే. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 15, 2025, 03:32 PM IST
Fishing Ban In AP: ఆంధ్రప్రదేశ్‌లో ఆగిన చేపల వేట.. 61 రోజులు బంద్

Marine Fishing Ban: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు తీర ప్రాంతంలో చేపల వేట నిషేధానికి గంట మోగింది. సోమవారం అర్ధరాత్రి నుంచి 61 రోజుల పాటు జూన్ 15వ తేదీ వరకు కొనసాగనుంది. దీనికోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. మత్స్యసంపద వృద్ధి చెందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రెండు నెలల పాటు సముద్రంలో చేపల వేటను నిషేధించే విషయం తెలిసిందే. మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘించి వేట చేస్తే కేసులు నమోదు చేస్తామని మత్స్యశాఖ అధికారులు హెచ్చరించారు.

Add Zee News as a Preferred Source

Also Read: YS Sharmila: 'అప్పుడు గ్రాఫిక్స్‌.. ఇప్పుడు ఏఐ రాజధాని' అమరావతిపై వైఎస్‌ షర్మిల ఫైర్

సముద్రంలో వేట నిలిచిపోయింది. నేటి నుంచి జూన్ 15 వరకు సముద్రంలో చేపలు, రొయ్యలు, ఇతర సముద్రపు జీవులను వేటాడడం నిషేధం. ప్రతి యేటా ఇలా 61 రోజులు పాటు ప్రభుత్వం వేట నిషేధిస్తుంది. సముద్రపు జీవులు గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతాయి. ఈ క్రమంలో వేట సాగితే వాటి సంతానోత్పత్తి ప్రక్రియకు ఆటంకం ఏర్పడి మత్య్స సంపద తగ్గుతుంది. అందుకోసం సముద్ర ఉత్పత్తులను పెంచేందుకు ఈ వేట నిషేధాన్ని అమలు చేస్తున్నారు.

Also Read: Anna Lezhneva: గుండు చేయించుకున్న 'కొణిదెల' కోడలు.. కన్న కొడుకు కోసం 'తల్లి ఆరాటం'

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో యూ కొత్తపల్లి, తొండంగి, కాకినాడ అర్బన్ ,రూరల్, తాళ్లరేవు, ఐ పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, సఖినేటిపల్లి మండలాల్లో వేటను నిషేధించారు. వేట నిషేధం కారణంగా 6 వేల బోట్లు నిలిచిపోయాయి. వేటపై ఆధారపడి జీవించే 40 వేల కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. పరోక్షంగా మరో 30 వేల కుటుంబాలు వేటపై ఆధారపడ్డాయి. వీరందరికి ఈ రెండు నెలలు గడ్డుకాలమే. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజవర్గం యు కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ, సుబ్బంపేట, మాయపట్నం, అమీనాబాద్, మూలపేట, శ్రీరాంపురం, పొన్నాడ గ్రామాలకు చెందిన మత్స్యకారులు మంగళవారం నుంచి ఇళ్లకు పరిమితమయ్యారు.

సముద్రపు తీర ప్రాంతంలో 1,500 బోట్లకు లంగర్ వేసి వదిలేశారు. గతేడాది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం వేట నిషేధ సమయంలో ఇవ్వాల్సిన రూ.10 వేల ఆర్థిక సహాయం అందించలేదు. దీనిని కూటమి ప్రభుత్వం రూ.20 వేలకు పెంచి నిషేధానికి ముందుగానే పరిహారం ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మత్య్సకారులకు ఇప్పటివరకు ఆర్థిక సహాయం అందించలేదు. రెండు నెలలు సముద్రపు ఉత్పత్తులు లభించకపోవడంతో పూర్తిగా చెరువు చేపలు, చెరువుల్లో పెంచిన రొయ్యలు మాత్రమే లభించనున్నాయి. అయితే మత్స్యకారులు ఎలాంటి యంత్రాలు లేని సాంప్రదాయ తెప్పలపై వేట చేసుకునే అవకాశం మాత్రం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News