Bandla Ganesh Fires on Nagababu:పిఠాపురం జనసేన .. జయకేతనం సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ బండ్ల గణేష్ పరోక్షంగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పిఠాపురంలో పవన్ గెలుపు వెనుక ఎవరైన ఉన్నామని అనుకుంటే వారి ఖర్మ అని నాగబాబు చేసిన వ్యాఖ్యలు వర్మను ఉద్దేశించి చేసిందనే అని పలువురు చెప్పుకుంటున్నారు.
ఈ వ్యాఖ్యల పైన టీడీపీ.. వర్మ మద్దతు దారులు ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా బండ్ల గణేష్ ఒక ట్వీట్ చేశారు. జీవితంలో ఎవరైనా నీకు సాయం చేస్తే దాన్ని రాయిపై చెక్కించుకున్నట్లు గుర్తుంచుకో.. కానీ నువ్వు ఎవరికైనా సాయం చేస్తే దాన్ని నీటిపై రాసినట్లు మరిచిపో.. నిజమైన మంచితనం అంటే మళ్లీ ఏమీ ఆశించకుండా చేయడమేనంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. మొత్తంగా నాగబాబు కు కృతజ్ఞతలు లేదనే విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ 40 యేళ్ల టీడీపీని నిలబెట్టింది మేమే అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి.
మా పార్టీ వల్లనే తెలుగు దేశం పార్టీ ఇపుడు అధికారం అనుభవిస్తుందనే విషయాన్ని ప్రస్తావించారు. మొత్తంగా తెలుగు దేశం పార్టీకి ఎక్కడ ఉండాలో పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పాడు. మొత్తంగా చంద్రబాబు నాల్గోసారి ముఖ్యమంత్రి కావడానికి తానే కారణం అనే విషయాన్ని ప్రస్తావించడం ఇక్కడ గమనార్హం.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.