Hindi Controversy: జనసేన ఆవిర్భావ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వివిధ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కొన్ని వ్యాఖ్యలయితే దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు వేదికగా మొదలైన హిందీ వ్యతిరేక ఉద్యమంపై పవన్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే..
జయకేతనం పేరుతో జనసేన ఆవిర్భావ సభ పిఠాపురంలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ సభల జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రిభాషా విధానంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కొందరు హిందీ భాషపై గగ్గోలు పెడుతున్నారంటూ పరోక్షంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు చురకలు అంటించారు. హిందీ భాష నేర్చుకోవల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. హిందీ సినిమాల డబ్బింగ్‌తో వ్యాపారం చేసుకోవచ్చు గానీ హిందీ మాట్లాడకూడదంటారా అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హిందీ వ్యతిరేకిస్తున్నవాళ్లు కూడా తమ సినిమాలు హిందీలో డబ్ చేసుకుంటున్నారని విమర్శించారు. దేశంలో భాషాపరమైన వైవిద్యం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ని భాషలు నేర్చుకుంటే అంతగా మెరుగుపడతామన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయదల్చిన త్రిభాషా సూత్రాన్ని అనుసరించక తప్పదన్నారు. హిందీ భాష వద్దు గానీ వాళ్ల డబ్బులు కావాలా అంటూ తమిళనాడు చలనచిత్ర పరిశ్రమపై కూడా విమర్శలు చేశారు. దేశ ఐక్యత కోసం బహుభాషా విధానం ఉండాలన్నారు.
ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే నెటిజన్లు పవన్ కళ్యాణ్‌ను ఊసరవెల్లితో పోలుస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఉత్తరాది ఆహంకారం, దక్షిణాది అంటే చిన్నచూపంటే ఊగిపోతూ చేసిన ప్రసంగాల క్లిప్పింగులు బయటకు తీశారు. తాజాగా నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు వేశారు. తిరుమల లడ్డూ వివాదం, పవన్ కళ్యాణ్ సనాతన అవతారంపై కామెంట్లు చేసిన ప్రకాశ్ రాజ్ ఇప్పుడు త్రిభాషా విధానంపై పవన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని, స్వాభిమానంతో తమ మాతృభాషను, తమ తల్లిని కాపాడుకోవడమేనని పవన్ కళ్యాణ్‌కు ఎవరైనా చెప్పండి ప్లీజ్..జస్ట్ ఆస్కింగ్ అంటూ ముగించారు ప్రకాశ్ రాజ్ ఇచ్చిన ఈ కౌంటర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రకాశ్ రాజ్ కౌంటర్‌పై నెటిజన్లు లేదా పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Also read: Chameleon vs Pawan Kalyan: ఊసరవల్లి కంటే వేగంగా పవన్ కళ్యాణ్, ట్రెండ్ అవుతోన్న ఆ పదం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









