Daggubati Met Babu: చాలా కాలం తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి ఆయన తోడల్లుడు, మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వెళ్లారు. తాను రాసిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా చంద్రబాబును దగ్గుబాటి ఆహ్వానించారు. దగ్గుబాటి సతీమణి పురందేశ్వరి కూటమి పార్టీల భేటీల సందర్భంగా పలుమార్లు చంద్రబాబు నివాసానికి వచ్చారు. రెండు కుటుంబాలకు చెందిన పిల్లలు తరచూ కలుసుకుంటూనే ఉంటారు.
దగ్గుబాటి, చంద్రబాబు సైతం కుటుంబ కార్యక్రమాల్లో కలుసుకుంటున్నా చంద్రబాబు నివాసానికి రావడం చాలా కాలం తర్వాత ఇదే. ఈ పుస్తకావిష్కరణకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా హాజరవుతున్నారని సమాచారం. అప్పట్లో 1995లో అన్న ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ లో చంద్రబాబుకు దగ్గుబాటి దంపతులు ఎంతగానో సహకరించారు. అంతేకాదు అప్పట్లో తన తండ్రి లక్ష్మి పార్వతి రాకతో అన్నగారితో వాళ్ల పిల్లలు దూరమయ్యారు. దాన్ని అవకాశంగా మలుచుకున్న చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్ ను గద్డె దింపి .. తాను ముఖ్యమంత్రి అయ్యారు. అంతేకాదు అప్పట్లో అన్నగారిపై బొజ్జల గోపాలకృష్ణ రెడ్డికి చెందిన వైస్ రాయ్ హోటల్లో చెప్పులు వేయించడం అప్పట్లో కలకలం రేపింది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
అంతేకాదు ఈ వెన్నుపోటు ఎపిసోడ్ లో చంద్రబాబు వెనక దగ్గుబాటి వెంకటేశ్వరరావు కర్త, కర్మ, క్రియగా నిలిచారు. ఆయనతో పాటు ఎన్టీఆర్ కుమారులైన హరికృష్ణ, బాలకృష్ణల సహకారం ఉంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మెల్లిగా.. హరికృష్ణతో పాటు దగ్గుబాటి వేంకటేశ్వరరావును పార్టీ నుంచి దూరం చేసారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం వెనక తన పాత్ర ఎంతో ఉన్నా.. ఆ తర్వాత తనను కూరలో కరివేపాకు మాదిరి తీసిపారేయడాన్ని దగ్గుబాటి దంపతులు జీర్ణించుకోలేకపోయారు. ఇక రాజకీయాల్లో తర తమ భేదాలు ఉండవు అనే సంగతి తెలిసిందే కదా. ఏది ఏమైనా ఆ తర్వాత ఎన్నో ఏళ్లుకు ఈ ఇద్దరు తోడళ్లళ్లు కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతకరించుకుంది.
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









