AIIMS Mangalagiri Jobs: మంగళగిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాలు, ఎలా ఎంపిక చేస్తారంటే

AIIMS Mangalagiri Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 26, 2025, 08:50 PM IST
AIIMS Mangalagiri Jobs: మంగళగిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాలు, ఎలా ఎంపిక చేస్తారంటే

AIIMS Mangalagiri Jobs: ఆంధ్రప్రదేశ్ మంగళగిరి ఎయిమ్స్‌లో కీలకమైన పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ వెలువడింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అర్హత ఉన్న అభ్యర్ధులు మార్చ్ 2లోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. 

Add Zee News as a Preferred Source

ఆన్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ విడుదలైంది. తగిన విద్యార్ఙత ఉంటే ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూతో ఎంపికయ్యే అవకాశం ఉంది. మొత్తం ఆరు పోస్టులు ఉన్నాయి. వీటిలో NMHS Survey Field Data Collector, Research Assisstant పోస్టులు ఉన్నాయి. Survey Field Data Collector  పోస్టులు 5 ఖాళీలు ఉంటే Research Assisstant ఒకటే ఖాళీ ఉంది. అర్హత కలిగిన ఆసక్తి ఉన్నఅభ్యర్ధులు మార్చ్ 2 వరకు అప్లై మెయిల్ ద్వారా సీవీ పంపిస్తే సరిపోతుంది. urvey Field Data Collector పోస్టుల ఇంటర్వూలు మార్చ్ 4వ తేదీన మంగళగిరి ఎయిమ్స్ కార్యాలయంలో జరుగుతాయి.నేషనల్ మెంటల్ హైల్త్ సర్వే ప్రాజెక్టు కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. 

Survey Field Data Collector పోస్టులకు ఆరు నెలల కాంట్రాక్ట్ ఒప్పందంతో ఎంపిక చేస్తారు. అదే Research Assisstant పోస్టుకు అయితే 11 నెలల కాంట్రాక్ట్ ఒప్పందంతో తీసుకుంటారు. అభ్యర్ధుల పనితీరు ఆధారంగా కాంట్రాక్ట్ పొడిగిస్తుంటారు. సర్వే ఫీల్డ్ డేటా కలెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు సైకాలజీ, సోషల్ వర్క్, సోషియాలజీ, రూరల్ డెవలప్‌మెంట్ విభాగాల్లో పీజీ పూర్తి చేసి ఉండాలి. రాష్ట్ర స్థాయి ప్రాజెక్టుల్లో పనిచేసిన అనుభవం ఉండాలి. ఇక రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుకు మైక్రో బయాలజీ, వైరాలజీ, మెడికల్ జెనెటిక్స్, మాలిక్యులర్ బయోలజీ, బయో టెక్నాలజీలో ఎంఎస్సీ చేయాలి. 

సర్వే ఫీల్డ్ డేటా కలెక్టర్ పోస్టులకు మార్చ్ 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ap.nmhs2cen@nimhans.net కు సీవీ మెయిల్ చేయాలి. మార్చ్ 4వ తేదీ ఉదయం 8.30 గంటలకు మంగళగిరి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. అదే రోజు ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు ఉంటాయి. 

రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుకు మార్చ్ 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అధికారిక మెయిల్ ఐడీ vrdlicmr.aiims@gmail.com  కు సీవీ పంపించాలి. ఇంటర్వూ తేదీ తరువాత వెల్లడిస్తారు. సర్వే ఫీల్డ్ డేటా కలెక్టర్ పోస్టులకు 45 వేలు జీతం, ఇతర అలవెన్సులు ఉంటాయి. వయస్సు 40-45 ఏళ్లు ఉండాలి. రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుకు 35 వేల జీతం ఇతర అలవెన్సులు ఉంటాయి. వయస్సు 30 ఏళ్ల వరకు ఉండాలి. 

Also read: 7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ నజరానా, డీఏ ప్రకటన ఎంత పెరుగుతుంది

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News