Tirumala Video: తిరుమలలో మళ్లీ అపచారం.. ఎంత మొత్తుకున్న ఇంతేనా..?.. మండిపడుతున్న భక్తులు.. వీడియో వైరల్..

TTD news: తిరుమలలో ఇటీవల అనేక అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పిన టీటీడీ గట్టిగా చర్యలు తీసుకొవట్లేదని భక్తులు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 27, 2025, 12:30 PM IST
  • తిరుమలలో మళ్లీ ఎగిరిన విమానం..
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు..
Tirumala Video: తిరుమలలో మళ్లీ అపచారం.. ఎంత మొత్తుకున్న ఇంతేనా..?.. మండిపడుతున్న భక్తులు.. వీడియో వైరల్..

Aircraft flying over Tirumala Balaji main temple video: తిరుమల ఇటీవల వరుస వివాదాలతో వార్తలలో ఉంటుంది. ఈక్రమంలో కూటమి సర్కారు ఏపీలో  అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. అంతే కాకుండా.. టీటీడీ బోర్డును సైతం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం తిరుమలలో పాపవినాశనంలో బోట్ ను ఫారెస్ట్ అధికారులు ఏర్పాటుచేయడం వివాదాస్పదంగా మారింది. ఇది టూరిస్ట్ ప్రదేశం కాదని.. పవిత్రమైన ఆధ్యాత్మికమైన ప్రదేశమంటూ భక్తులు మండిపడుతున్నారు.

Add Zee News as a Preferred Source

తిరుమల పవిత్రతను చెడకొట్టాలని చూస్తే ఊరుకోబోమని కూడా భక్తులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం తిరుమలలో గత సర్యారు హయాంలో తిరుమలలో స్వామివారికి సమర్పించే నైవేద్యంలో కల్తీ ఆహర పదార్థాలను వాడారని కూడా విషయం బైటపడింది. స్వామివారికి సరైన క్వాలీటీతో లేని సరుకులతో నైవేద్యాలు అర్పించినట్లు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ  ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనిపై ప్రస్తుతం శ్రీవారి  భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇక తిరుమలలో ఇప్పటికే ఆలయంపై నుంచి విమానాలు పోకుండా చూడాలని కూడా టీటీడీ ఇప్పటికే కేంద్ర విమానయాన సంస్థకు లెటర్ రాసింది. కానీ ఎన్నిసార్లు చెప్పిన స్వామి వారి ప్రధాన ఆలయం మీద నుంచి విమానాలు ఇప్పటికి కూడా ఎగుగుతున్నాయి. ఇది ఆగమ శాస్త్రంకు పూర్తిగా విరుద్ధం .ఇప్పటికి దీనిపై అనేక సందర్భాలలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ రోజు కూడా తిరుమలలో ఉదయం 8 గంటలకు స్వామి వారి ప్రధాన ఆలయం మీద నుంచి విమానం చక్కర్లు కొట్టింది.

Read more: Tirumala Boating: తిరుమలలో రాజుకున్న మరో వివాదం.. పవన్ కళ్యాణ్‌పై మండిపడుతున్న శ్రీవారి భక్తులు..!..

దీనిపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పాలని.. ఏపీ నేత రామ్మోహన్‌ నాయకుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయనకు టీటీడీ ఇప్పటికే పలు మార్లు వినతి పత్రం ఇచ్చింది. అయిన కూడా ఇలాంటి ఘటనలు ఏంటని కూడా శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. ఇప్పటికే తిరుమలను నో ఫైయింగ్ జోన్ గా ప్రకటించాలని టీటీడీని భక్తులు డిమాండ్ చేసిన విషయంతెలిసిందే.అయిన కూడా ఇలాంటి ఘటనలు ఏంటని కూడా భక్తులు తీవ్ర మనోవేదనకు గురౌతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News