Yoga Day 2025 In Vizag: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పండుగలా సంబరాలు జరగనున్నాయి. రెండు రోజుల పాటు జరగనున్న యోగా సంబరాలకు విశాఖపట్టణంతో సహా ఏపీలోని అన్ని జిల్లాలు సిద్ధమయ్యాయి. విశాఖపట్టణంలో జరగనున్న యోగా దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. యోగాతో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు ఏపీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. జూన్ 20, 21వ తేదీల్లో జరగనున్న యోగాంధ్రకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: RTC Free Bus Journey: ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభం
విశాఖపట్టణం వేదికగా ఈ నెల 21 తేదీన జరిగే అంతర్జాతీయ యోగా డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయిస్తున్నారు. రెండు గిన్నీస్ రికార్డులు, మొత్తం 22 ప్రపంచ రికార్డుల సాధన లక్ష్యంగా యోగా డే కార్యక్రమాన్ని తలపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్న ఈ కార్యక్రమాన్ని ప్రపంచం గుర్తించుకునేలా నిర్వహించనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు.
అమరావతిలోని సచివాలయంలో గురువారం యోగాంధ్రపై సీఎం చంద్రబాబు సమీక్ష చేసి యోగా డే కార్యక్రమానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. రేపు 25 వేల మంది గిరిజన విద్యార్ధులు 108 నిముషాల పాటు సూర్య నమస్కారాలు చేయనున్నారు. ఎక్కువ మంది ఒకే చోట చేయడంతో పాటు ఎక్కువ మంది ఒకేసారి సూర్య నమస్కారాలు చేసి రెండు గిన్నీస్ రికార్డులను సాధించడమే లక్ష్యం. విశాఖలోని రామకృష్ణా బీచ్ నుంచి భోగాపురం వరకు 26 కిలోమీటర్ల మేర విస్తృత ఏర్పాట్లు చేశారు.
Also Read: YS Sharmila: బీజేపీ దత్తపుత్రుడు వైఎస్ జగన్‌కు ఆంక్షలు లేవా? వైఎస్ షర్మిల నిలదీత
==> ఆర్కే బీచ్ వేదికగా మొత్తం 3.19 లక్షల మంది ఒకే చోటు నుంచి యోగా చేసేలా ఏర్పాట్లు చేశారు. యోగా డే రోజు విశాఖ సహా రాష్ట్రంలోనూ.. దేశంలో.. ప్రపంచవ్యాప్తంగా 8 లక్షల ప్రాంతాల్లో ఒకేసారి ప్రజలు పాల్గొనున్నారు.
==> యోగా డేలో పాల్గొనేందుకు 2.39 కోట్ల మంది రిజిస్ట్రేషన్
==> మే 21 తేదీ నుంచి జూన్ 21 వరకూ నెల పాటు యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణ
==> పర్యాటక ప్రాంతాలు, ఇతర ముఖ్యమైన ప్రాంతాలతో పాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 15 వేలకు పైగా యోగా పోటీలు నిర్వహించారు
==> 5,451 మంది మాస్టర్ ట్రైనర్లు నెల రోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహించగా.. 1,05,58,299 మందికి సర్టిఫికెట్లు పంపిణీ
విశాఖలో ఏర్పాట్లు
==> జూన్ 21 తేదీ ఉదయం 6.30 నుంచి 8 గంటల వరకు యోగా డే కార్యక్రమం
==> యోగాలో పాల్గొనే వారందరికీ ఆధార్‌తో అనుసంధానించి ప్రతీ ఒక్కరికి క్యూ ఆర్ కోడ్ జారీ
==> యోగా చేసేందుకు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్ ఏర్పాటు
==> ఒక్కో కంపార్ట్‌మెంట్‌కు వెయ్యి మంది చొప్పున ఉండేలా 326 కంపార్ట్‌మెంట్‌లు సిద్ధం
==> యోగా డే లో పాల్గొనే వారందరికీ 3.32 లక్షల టీ షర్టులు, 5 లక్షల యోగా మ్యాట్లు
==> ప్రత్యేకంగా టాయిలెట్ల ఏర్పాటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook