Alluri Private Travel Bus Accident: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘాట్ రోడ్ వద్ద లోయలో అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. పలువురు ప్రయాణీకులకు తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్నారు. వీరంతా భద్రాచలంలో రామయ్య దర్శనం చేసుకుని.. అన్నవరం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రయాణ సమయంలో మొత్తం బస్సులో 30 మంది ఉన్నారు. అయితే చింతూరు నుంచి మారేడుమిల్లి ఘాట్ రోడ్డులోకి వచ్చిన ప్రైవేటు బస్సు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పడంతో పడిపోయింది. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. 108 వాహనాలు కూడా వచ్చి సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే మీరు ఎక్కువ శాతం ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సీఎం చంద్రబాబు తీవ్ర సంతాపం..
చింతూరు బస్సు ప్రమాదం ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇక మృతులు చిత్తూరు టౌన్ సహ కడప, బెంగుళూరు చెందినవారు. చింతూరు నుంచి మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఈ ప్రైవేట్ బస్సు బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజాము 3 గంటల సమయంలో దుర్ఘటన చోటు చేసుకుంది.
30 మంది ప్రయాణికులతో వెళుతున్న ఈ పర్యాటక బస్సు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన వారికి మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. ఇక హోం మంత్రి వంగలపూడి అనిత కూడా ప్రమాదవ స్థలానికి కాసేపట్లో బయలుదేరనున్నారు. అక్కడ హృదయ విదారక దృశ్యాలు చోటుచేసుకున్నాయి. తీర్థయాత్రకు వెళ్లి వెళ్తున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు రోదన తీరు కలచివేస్తోంది.
డిప్యూటీ సీఎం పవన్ సంతాపం..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘోర దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానంగా యాత్రికులతో కూడిన బస్సు అదుపుతప్పి లోయలో పడింది. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ దుర్ఘటనలో 22 మంది గాయాలు పాలయ్యారు. ఇప్పటి వరకు 9 మంది మృతి చెందారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సాయం చేస్తుందని ఆయన తెలిపారు. అంతకు ముందే మంత్రి లోకేష్ కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ప్రమాదానికి కారణాలు..
చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్తున్న బస్సు ప్రమాదం విషయంలో అధికారులు ఎలాంటి అంచనాకు రాలేకపోతున్నారు. అసలు ప్రమాదం జలా జరిగిందో అంచనా వేయలేకపోతున్నారు. మలుపు దగ్గర డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేకపోయారా? ఘాట్ రోడ్డులో జర్నీ డ్రైవర్ కొత్త కావడం వల్లే ఇలా జరిగిందా? దట్టమైన పొగ మంచు పేరుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగిందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇక సిగ్నల్ లేని ప్రాంతం కావడంతో బాధితులు 108 కు ఫోన్ చేయడంలో కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సహాయక చర్యల్లో ఆలస్యం కూడా అయింది. అంబులెన్సులు ప్రమాద స్థలానికి వెళ్లడానికి ఆలస్యం జరిగింది.
ఇదీ చదవండి: కొత్త ఇ-పాస్‌పోర్ట్ వచ్చేసింది.. డౌన్‌లోడ్ చేసుకోవచ్చా? అప్లై మీ నగరంలో అందుబాటులో ఉందా?
ఇదీ చదవండి: వృద్ధాప్యంలో భార్యాభర్తలు రూ.10 వేల పెన్షన్ పొందాలంటే ఈ చిన్న పని చేయండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









