Modi Surprise gift to Pawan Video: పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు ముందే సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన మోదీ.. వీడియో ఇదే..

Amaravati capital launch programme: అమరావతి రాజధాని రీలాంచ్ కార్యక్రమంలో ఎంతో కన్నుల పండుగగా జరిగింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ కు సర్ ప్రైజ్ గిప్ట్ ఇచ్చారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : May 2, 2025, 06:43 PM IST
  • పవన్ కు మోదీ స్పెషల్ గిప్ట్..
  • నవ్వుతూ ఎమోషనల్ అయిన డిప్యూటీ సీఎం..
Modi Surprise gift to Pawan Video: పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు ముందే సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన మోదీ.. వీడియో ఇదే..

Modi Surprise gift to Pawan kalyan Video: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం అమరావతి రాజధాని రీలాంచ్ కార్యక్రమంలో ఎంతో కన్నుల పండుగలా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ , మంత్రులు హజరయ్యారు. ఈ క్రమంలో ప్రధాని మోదీకి మంత్రులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు.

Add Zee News as a Preferred Source

అమరావతి రాజధాని ఏపీ ప్రజల ఎన్నోస్వప్నంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అదే విధంగా ఈ కార్యక్రమం ఎంతో గ్రాండ్ గా జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు.. ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. మంత్రి నారాలోకేష్ సైతం.. పహల్గం ఘటనలో అసువులు బాసిన అమరులకు నివాళులు అర్పించారు. అంతేకాకుండా.. పహల్గం ఘటనలో కేంద్రం తీసుకుంటున్న చర్యల్ని కొనియాడారు.

 

ఈ క్రమంలో  పవన్ కళ్యాన్ సైతం చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.  రాజధాని కోసం అమరావతి రైతులు చేసిన ప్రాణ త్యాగాల్ని గుర్తుచేసుకున్నారు.  వైసీపీ హయాంలో ఎన్ని వేధింపులకు గురిచేసిన, అక్రమ కేసులు బనాయించిన కూడా దేనికి వెనక్కు వెళ్లకుండా.. రైతులు అమరావతి కోసం ఎంతో శ్రమించారన్నారు. అదే విధంగా అమరావతి రైతులక శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. 

చంద్రబాబు పాలనలో అమరావతి రాబోయే తరాలకు అద్భుత రాజధానిగా నిలుస్తుందని.. దేశానికే తలమానికమవుతుందని పవన్ అన్నారు. అన్నారు. అమరావతి నిర్మాణానికి అన్నివిధాలుగా అండగా ఉంటున్న ప్రధాని మోదీకి పవన్ కళ్యాన్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Read more: Nara Lokesh Video: ఒక్క పాకిస్థాన్  కాదు... వంద పాకిస్థాన్‌లు  వచ్చిన ఏంపీకలేరు.. మంత్రి నారా లోకేష్.. వీడియో ఇదే..

అయితే.. స్టేజీ మీద ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని మోదీ తన జేబులో నుంచి ఒక చాక్లెట్ తీసి.. పవన్ కళ్యాణ్ ను కానుకగా ఇచ్చారు. అది తీసుకున్న పవన్ కళ్యాణ్ నవ్వుతు మురిసిపోయారు. అయితే.. అది ఒక చాక్లెట్ . దీంతో  మోదీ పవన్ కు చాక్లెట్ ఇచ్చి సర్ ప్రైజ్  చేయడం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News