NRT Icon Towers: 600 కోట్లు, 33 అంతస్థులు రెండు టవర్లతో ఎన్ఆర్‌టి ఐకాన్ టవర్స్

NRT Icon Towers: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో కీలక నిర్మాణం చేపట్టనున్నారు. ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేకంగా భారీ ఖర్చులో ఎన్ఆర్‌టీ ఐకాన్ భవనం నిర్మించనున్నారు. ఈ భవనం ఎలా ఉంటుంది, ఏమేం సౌకర్యాలు ఉంటాయో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 4, 2025, 04:37 PM IST
NRT Icon Towers: 600 కోట్లు, 33 అంతస్థులు రెండు టవర్లతో ఎన్ఆర్‌టి ఐకాన్ టవర్స్

NRT Icon Towers: ఏపీ రాజధాని ప్రాంతమైన అమరావతిలో మరో కీలకమైన నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ప్రవాసాంధ్రుల కోసం 5 ఎకరాల్లో ఈ నిర్మాణం చేపడుతున్నారు. ఆంగ్ల అక్షరం ఎ ఆకారంలో రెండు టవర్లుగా ఉండే ఈ నిర్మాణం అమరావతికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 

Add Zee News as a Preferred Source

ఐదేళ్ల విరామ తరువాత తిరిగి ఎన్ఆర్ఐ ప్రత్యేక భవనానికి అడుగులు పడ్డాయి. ఏపీ ప్రభుత్వం ప్రవాసాంధ్రుల కోసం తలపెట్టిన ఎన్ఆర్‌టి భవన నిర్మాణానికి  2014-19లోనే ఏర్పాట్లు పూర్తయినా ఆ తరువాత అధికారం కోల్పోవడంతో మూలనపడింది. ఇప్పుడు తిరిగి టెండర్లు పిలిచింది. ఈ భవనానికి ఎన్ఆర్‌టి ఐకాన్ అని పిలుస్తారు. 5 ఎకరాల స్థలంలో 11.65 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో 36 అంతస్థుల్లో ఈ భవనం రెండు టవర్లుగా ఉండి మధ్యలో గ్లోబ్‌తో ఉంటుంది. దూరం నుంచి చూస్తే ఇంగ్లీషు అక్షరం ఎ  కన్పిస్తుంది. 
 
600 కోట్ల ఖర్చుతో తలపెట్టిన ఈ భవనం నిర్మాణం మూడు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో ఫౌండేషన్ ఉంటుంది. తరువాత బిల్డింగ్ సూపర్ స్ట్రక్చర్ కోసం టెండర్లు పిలుస్తారు. ఆ తరువాత బయటకు కన్పించే అందమైన భాగం నిర్మాణానికి టెండర్లు ఆహ్వానిస్తారు. 2028 నాటికి ఈ భవనాన్ని పూర్తి చేయాలనేది లక్ష్యంగా ఉంది. ఎన్ఆర్ఐ నిధులతో వారి కోసమే ఈ భవనం నిర్మించనున్నారు. ఇందులో రెసిడెన్షియల్ ప్లాట్లు, ఆఫీసు స్పేస్ అన్నింటినీ వారికే విక్రయిస్తారు. పార్కింగ్ కోసం రెండు అంతస్థుల సెల్లార్ ఉంటుంది. ఆపై మూడు అంతస్థుల్లో పోడియం ఉంటుంది. ఆ తరువాత 33 అంతస్థులు ఉంటాయి. 

రెండు టవర్లలో ఒక్కొక్క దానిలో 29 అంతస్థులు ఉంటాయి. ఒక్కో టవర్‌లోని 29 అంతస్థుల్లో రెండేసి చొప్పున రెసిడెన్షియల్ ప్లాట్లు ఉంటాయి. రెండో టవర్‌లోని 29 అంతస్థుల్లో కార్యాలయాలు ఏర్పాటవుతాయి. వీటి ద్వారా 30 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇక రెండు టవర్లను కలుపుతూ నాలుగు అంతస్థులు ఉంటాయి. ఇందులో రివాల్వింగ్ రెస్టారెంట్ 360 డిగ్రీలు తిరుగుతూ ఉంటుంది. మద్యలో ఉండే గ్లోబ్ ఆకారంలో 10-12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెస్టారెంట్లు, కిచెన్, ఎగ్జిక్యూటివ్ డైనింగ్ హాల్, లాంజ్ ఉంటాయి. 

ఇక పోడియం మూడు అంతస్థుల్లో మైగ్రేషన్ రిసోర్స్ సెంటర్, కాన్ఫరెన్స్ హాల్, లైబ్రరీ, ఫుడ్ కోర్డ్ ఉంటాయి. సదస్సులు నిర్వహించుకునేందుకు 2 వేల సీట్ల కెపాసిటీతో ఆడిటోరియం ఉంటుంది. 1500 సీట్లతో యాంపీ థియేటర్ ఉంటుంది.

Also read: Rainfall: భారీ వర్షాలతో చల్లబడిన వాతావరణం, మరో రెండు రోజులు వర్షసూచన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News