Amaravati Railway Station: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక అమరావతి నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి మొదలైంది. వివిధ కట్టడాలకు సంబంధించిన గ్రాఫిక్స్ మైమరపిస్తున్నాయి. ఇప్పుడు అమరావతి రైల్వే స్టేషన్ పేరుతో మరో గ్రాఫిక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. దేశంలోనే అతి పెద్ద రైల్వే స్టేషన్ అమరావతిలో నిర్మించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
అమరావతి నగరాన్ని రైల్వే లైనుతో అనుసంధానించేందుకు ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్ నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్‌ను నెక్కల్లు-పెదపరిమి సమీపంలో నిర్మించతలపెట్టింది. మొత్తం 1500 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ స్టేషన్ నిర్మించనున్నారు. నంబూరు-ఎర్రుపాలెం మధ్యలో ఈ స్టేషన్ ఉంటుంది. 2,245 కోట్లతో 57 కిలోమీటర్ల మేర లైల్వే లైన్ నిర్మించి ప్రధాన లైనుతో అనుసంధానిస్తారు. మరో 2 నెలల్లో తొలి దశ టెండర్లు ఖరారు చేస్తారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి 27 కిలోమీటర్ల మేర మొదటి దశలో నిర్మాణం ఉంటుంది. రెండు నెలల్లో టెండర్లు పిలిచేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. ఇక దాములూరు-వైకుంఠపురం మధ్య కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల మేర రైల్వే బ్రిడ్జి నిర్మాణం ఉంటుంది. 800 కోట్లతో తొలి దశ పనులు చేపడతారు.
దేశంలో ప్రయాగ్ రాజ్, వారణాసి, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్ల తరహాలో అమరావతి రైల్వే స్టేషన్ కూడా అత్యంత సుందరంగా నిర్మితం కానుంది. ఇక కొత్తగా ఏర్పాటు కానున్న ఎన్టీఆర్ జిల్లాలోని పరిటాల రైల్వే స్టేషన్ వద్ద మల్టీమోడల్ కార్గో టెర్మినల్ నిర్మితం కానుంది. ఇది ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఉంటుంది. అమరావతి రైల్వే లైను 160 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునేలా కవచ్ టెక్నాలజీతో నిర్మితం కానుంది.
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి గుంటూరు-విజయవాడ సెక్షన్ మధ్యలో ఉన్న నంబూరు వరకు 57 కిలోమీటర్ల మేర సింగిల్ లైన్ నిర్మించనున్నారు. ఈస్టేషన్ పూర్తయితే హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, చెన్నై నగరాలతో అమరావతి అనుసంధానం పూర్తవుతుంది. ఎర్రుపాలెం-నంబూరు మధ్యలో పెద్దాపురం, చెన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను అమరావతి, తాడికొండ, కొప్పురావూరు స్టేషన్లు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. పెద్దాపురం, పరిటాల, కొప్పురావూరు పెద్ద స్టేషన్లుగా ఉంటే అమరావతి అతి పెద్ద రైల్వే స్టేషన్ కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









