AP: విదేశీ వర్శిటీల హబ్‌గా ఆంధ్రప్రదేశ్

Foreign university: ఆంధ్రప్రదేశ్ త్వరలో అంతర్జాతీయ యూనివర్శిటీల హబ్‌గా మారనుంది.  ఆస్ట్రేలియా, అమెరికా దేశాల  యూనివర్శిటీలు క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు  సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి.

Last Updated : Nov 27, 2020, 11:13 PM IST
AP: విదేశీ వర్శిటీల హబ్‌గా ఆంధ్రప్రదేశ్

Foreign university: ఆంధ్రప్రదేశ్ త్వరలో అంతర్జాతీయ యూనివర్శిటీల హబ్‌గా మారనుంది.  ఆస్ట్రేలియా, అమెరికా దేశాల  యూనివర్శిటీలు క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు  సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి.

అంతర్జాతీయ యూనివర్శిటీ ( International universities )లు ఏపీ ( Ap ) వైపు చూస్తున్నాయి ఇప్పుడు. విద్యారంగంలో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులు, ప్రాధాన్యత విదేశీ వర్శిటీల్ని ఆకట్టుకుంటోంది. విదేశీ వర్శిటీలు తమ క్యాంపస్‌లను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా ( America ) లోని ప్రతిష్టాత్మక జార్జియా టెక్ యూనివర్శిటీ, అలబామా స్టేట్ యూనివర్శిటీ, క్లెమన్స్ యూనివర్శిటీతో పాటు ఆస్ట్రేలియా ( Australia )కు చెందిన ప్రముఖ యూనివర్శిటీ క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. ఇప్పటికే ఆయా వర్శిటీల అధికారులు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే ఇవి కొలిక్కి రానున్నాయి.

రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు విదేశీ విద్య సులభంగా పొందడానికి వీలుగా ప్రత్యేకంగా విదేశీ విద్యా విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ( Ap cm ys jagan ) దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మన రాష్ట్ర విద్యార్థికి సులభంగా విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించడం, అక్కడి విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు, అధ్యాపకులతో పరిశోధనల్లో బాగస్వాముల్ని చేయడానికి వారధిగా పనిచేసేలా విదేశీ విద్యా విభాగాన్ని  రూపొందించారు. పరిశోధన, విద్యా బోధన తదితర రంగాల్లో విదేశీ వర్సిటీలతో అవగాహన ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అమెరికాలోని 36 వర్శిటీలు ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. కాకినాడలోని జేఎన్‌టీయూ వర్సిటీ ( jntu university ), యూనివర్సిటీ ఆఫ్‌ మిస్సోరి మధ్య ఇప్పటికే ఒప్పందం కుదిరి..వివిధ పరిశోధనల కోసమై 44 వేల డాలర్లు మంజూరయ్యాయి. Also read: AP: పొంచి ఉన్న మరో రెండు తుపాన్లు

Trending News