Gas leak: నంద్యాలలో గ్యాస్ లీకేజీ కలకలం.. ఒకరు మృతి
Gas leak tragedy: నంద్యాల: విశాఖపట్టణంలో ఇటీవల జరిగిన విషయ వాయువు లీకేజీ ఘటన మరువకముందే రాష్ట్రంలో ఇలాంటి మరో ఘటన చోటుచేసుకోవడం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. కర్నూలు జిల్లా (Kurnool district)లోని నంద్యాల (Nandyala)లోని ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో తాజాగా శనివారం ఉదయం విషవాయువు (Ammonia gas leak) లీకైంది.
Gas leak tragedy: నంద్యాల: విశాఖపట్టణంలో ఇటీవల జరిగిన విషయ వాయువు లీకేజీ ఘటన మరువకముందే రాష్ట్రంలో ఇలాంటి మరో ఘటన చోటుచేసుకోవడం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. కర్నూలు జిల్లా (Kurnool district)లోని నంద్యాల (Nandyala)లోని ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో తాజాగా శనివారం ఉదయం విషవాయువు (Ammonia gas leak) లీకైంది. ఈ ఘటనలో కంపెనీ జనరల్ మేనేజర్ శ్రీనివాసులు మృతి చెందారు. డిస్టిలరీ విభాగంలో నిల్వ ఉంచిన అమోనియా లీకవ్వడతోనే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంటున్నారు. ఘటన సమయంలో కంపెనీలో ఐదుగురు కార్మికులు ఉన్నారు. విషవాయువు లీకైన వెంటనే వారంతా పరుగులు తీశారు. సిబ్బందిని రక్షించి, లీకేజీని అరికట్టేందుకు వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఫ్యాక్టరీ మొత్తం విషవాయువు అలుముకోవడంతో అగ్నిమాపక సిబ్బంది సైతం ఇబ్బందులుపడ్డారు.
అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించింది. ఎస్పీవై ఆగ్రో కంపెనీలో విషవాయువు లీకైందని, ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్లు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. అస్వస్థతకు గురైన ముగ్గిరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వెల్లడించారు. వెంటనే అన్ని రకలా భద్రతా చర్యలు తీసుకున్నామని, గ్యాస్ లీకేజీ అదుపులోకి వచ్చిందన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు.
విశాఖ గ్యాస్ లీక్ ఘటన మరువకముందే.. నంద్యాలలో విషవాయువు లీకైందన్న సమాచారం తెలియగానే పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇదిలాఉంటే.. గ్యాస్ పైప్ వెల్డింగ్ సరిగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కంపెనీ యాజమాన్యం పేర్కొంది.