Thalliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి దాదాపుగా 9 నెలలు అవుతోంది. అయినా ఇప్పటికీ కొన్ని కీలకమైన సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. దాంతో ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పుడు ఇదే అంశంపై మంత్రి నారా లోకేశ్ శుభవార్త అందించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలుపై అప్‌డేట్ వచ్చింది. శాసనమండలిలో మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది ఏప్రిల్- మే నెల నుంచి రాష్ట్రంలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేస్తున్నామని మండలి సాక్షిగా చెప్పారు. తల్లికి వందనం పథకంలో భాగంగా ఇంట్లో ప్రతి బిడ్డకు 15 వేల రూపాయలు, అన్నదాత సుఖీభవలో భాగంగా రైతులకు 20 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించనున్నారు. సూపర్ సిక్స్ హామీల అమల్లో జాప్యంపై ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలకు మంత్రి లోకేశ్ సమాధానమిచ్చారు.
తాము అధికారంలో రాగానే ఫించన్ పెంచామని, ఏడాదికి ఉచితంగా మూడు సిలెండర్లు అందిస్తున్నామని తెలిపారు. చెత్తపన్ను, ల్యాండ్ టైట్లింగ్ చట్టాలను రద్దు చేశామన్నారు. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం తీసుకురాలేని కేంద్ర నిధుల్ని తాము 9 నెలల్లోనే తీసుకొచ్చామని లోకేశ్ స్పష్టం చేశారు. గత ఐదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం చోటుచేసుకుందని విమర్శించారు. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావన్నారు. అమరావతిపై మడమ తిప్పారన్నారు. 2019 నుంచి 2024 వరకూ రాష్ట్రం పారిశ్రామికంగా పూర్తిగా నష్టపోయిందని మండిపడ్డారు. ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదన్నారు. 2014-19 మధ్య జిల్లాకొక యాక్షన్ ప్లాన్‌తో అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









