AP SSC Results 2025: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఇప్పుడిక పదో తరగతి పరీక్ష ఫలితాల కోసం నిరీక్షణ నెలకొంది. ఇప్పటికే వాల్యుయేషన్ పూర్తవడంతో ఇక ఫలితాలు విడుదల చేసేందుకు రంగం సిద్ధమౌతోంది. ఈ క్రమంలోనే ఎప్పుడు విడుదలయ్యేది క్లారిటీ వచ్చేసింది.
ఏపీ ఎస్ఎస్‌సి పరీక్ష ఫలితాలు 2025 విడుదల కానున్నాయి. ఏపీలో మార్చ్ 17 నుంచి మార్చ్ 31 వరకూ పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 6.5 లక్షల మంది విద్యార్ధులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఇప్పటికే ప్రశ్నాపత్రాల మూల్యాంకనం పూర్తయింది. ప్రస్తుతం మార్కుల ఆన్‌లైన్ ఎంట్రీ నడుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే ఇక ఫలితాలు విడుదల చేసేస్తారు. అందుకే ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలను ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు సమాచారం. ఇందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఒకసారి ఫలితాలు విడుదలయ్యాక చాలా సులభంగా సంబంధిత వెబ్‌సైట్ bie.ap.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏపీ పభుత్వ వాట్సప్ నెంబర్ నుంచి కూడా ఫలితాలు పొందవచ్చు.
ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు ఎలా చెక్ చేసుకోవచ్చు
ముందుగా అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.in ఓపెన్ చేయాలి. ఇప్పుడు అక్కడ కన్పించే ఎస్ఎస్‌సి రిజల్ట్స్ 2025 లేదా 10వ తరగతి ఫలితాలు లింక్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు మీ ఫలితాలు మార్కులతో సహా ప్రత్యక్షమౌతాయి. ఈ మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవచ్చు.
ఏపీ ప్రభుత్వం వాట్సప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఈ నెంబర్ మీ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. వాట్సప్ ఓపెన్ చేసి ఈ నెంబర్‌కు హాయ్ అని టైప్ చేసి పంపించాలి. వెంటనే మీకు సర్వీసెస్ ఎంపిక చేసుకోమని కన్పిస్తుంది. అందులో ఎడ్యుకేషన్ సర్వీసెస్ క్లిక్ చేస్తే పదో తరగతి ఫలితాల లింక్ కన్పిస్తుంది. ఇది క్లిక్ చేసి మీ పుట్టిన తేదీ, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే పీడీఎఫ్ రూపంలో మీ మార్కుల మెమో వస్తుంది. డౌన్‌లోడ్ చేసుకుని భద్రపర్చుకోవాలి.
Also read: Araku Tour package: కేవలం 2 వేలలో అరకు సందర్శన, ఐఆర్సీటీసీ బెస్ట్ సమ్మర్ వెకేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









