AP 10th Exam Results: ఏపీలో ఇప్పుడు రెండు కీలకమైన పబ్లిక్ పరీక్షలు ముగిశాయి. మార్చ్ 1 నుంచి మార్చ్ 15 వరకూ ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగితే ఆ తరువాత పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగాయి. మార్చ్ 31 రంజాన్ పండుగ కావడంతో చివరి పరీక్ష సోషల్ స్టడీస్ ఏప్రిల్ 1న జరిగింది.
మొత్తానికి మార్చ్ 17 నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 1తో ముగిశాయి. ఒక రోజు విరామం తరువాత ఏప్రిల్ 3 అంటే రేపటి నుంచి పదో తరగతి పరీక్ష పత్రాల వ్యాల్యుయేషన్ జరగనుంది. ఏప్రిల్ 9 వరకూ వ్యాల్యుయేషన్ జరుగుతుంది. ఇక సార్వత్రిక విద్యాపీఠం 10, ఇంటర్ పరీక్ష పత్రాల మూల్యాంకనం కూడా ఏప్రిల్ 3-7 మధ్య జరగనుంది. పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం కోసం రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో వ్యాల్యుయేషన్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. అసిస్టెంట్ ఎగ్జామినర్ రోజుకు 40 పేపర్లు దిద్దాల్సి ఉంటుంది.
పేపర్ వ్యాల్యుయేషన్‌లో తేడా వస్తే సంబంధిత అధికారులపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయి. మరోవైపు వ్యాల్యుయేషన్ సెంటర్లలో మొబైల్ ఫోన్లను పూర్తిగా నిషేధించారు. ఏప్రిల్ నెలాఖరులో పదో తరగతి పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుతం ఏపీలో ఇంటర్ పరీక్షల మూల్యాంకనం జరుగుతోంది. మరో వారం రోజుల వ్యవధిలో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఏప్రిల్ 12-15 మధ్యలో ఇంటర్ పరీక్షల ఫలితాలు వెలువడనున్నాయి.
పదో తరగతి పరీక్ష ఫలితాలను https://www.bse.ap.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
Also read: Japan: అక్కడ వారంలో 36 గంటలు శృంగార సెలవు, నమ్మలేకున్నారా నిజమే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









